RGV Dhurandhar Review: బాలీవుడ్‌కు కొత్త జోష్ తీసుకొచ్చిన సరికొత్త చిత్రం ‘ధురంధర్’. ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకువచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుంది. ‘ధురంధర్’ చిత్రం గురించి ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు. తాజాగా ఈ చిత్రంపై రామ్‌గోపాల్ వర్మ ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తన రివ్యూ ఇచ్చారు. తన సుదీర్ఘ పోస్ట్‌లో.. ఈ చిత్రం ఇండియన్ సినిమా ఫ్యూచర్ మార్చిందన్నారు. ఈ పోస్ట్‌లో ఆర్జీవీ ధురంధర్ దర్శకుడు ఆదిత్య ధర్‌ను ఆకాశానికి ఎత్తేశారు.
READ ALSO: Bangladesh Violence: హిందూ వ్యక్తి హత్యపై స్పందించిన మహ్మద్ యూనస్ ప్రభుత్వం..
చరిత్రలో ధురంధర్ సినిమా ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోతుంది. ఈ చిత్రం ఏ భాషలో వచ్చింది అనేది నేను మాట్లాడడం లేదు. ఎందుకంటే ఇది ఇండియన్ సినిమా. ఇప్పటివరకూ ఇలాంటి కథతో ఏ సినిమా రాలేదు. వినోదాన్ని పంచడంతో పాటు ప్రేక్షకుల మనసులు గెలుచుకోవడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకూ ప్రతి సీన్ గుర్తుండేలా విజువలైజ్ చేశారు. ఈ సినిమా మొత్తం చూసిన తర్వాత మన మనసుల్లో ఏదో తెలియని భావోద్వేగం నిండిపోతుంది. అలా తీయడం దర్శకుడు ఆదిత్య పనితనానికి నిదర్శనం’’ అని ఆర్జీవీ తన పోస్ట్‌లో వెల్లడించారు. ‘ధురంధర్’ నుంచి ఫిల్మ్ మేకర్లు నేర్చుకోవాల్సిన పాఠాలు ఉన్నాయని అన్నారు. రణ్వీర్ సింగ్ స్టార్ అయినా… కథ డిమాండ్ ప్రకారం అక్షయ్ ఖన్నాకు స్పేస్ ఇచ్చాడు” అంటూ రణ్వీర్ను కొనియాడారు. ధురంధర్ కేవలం బ్లాక్‌బస్టర్ కాదు… ఫిల్మ్ ఇండస్ట్రీకి హెచ్చరిక. గ్రో అప్ అవ్వండి” అంటూ పోస్ట్‌ను ముగించారు. ఆదిత్య ధర్‌కు థ్యాంక్స్ చెబుతూ… “భారతీయ సినిమా స్థాయిని పెంచినందుకు ధన్యవాదాలు” అని పేర్కొన్నారు.
ఈ పోస్ట్‌పై దర్శకుడు ఆదిత్య ధర్ స్పందించారు. ఇకపై ఏ మూవీకి దర్శకత్వం వహించినా ఈ పోస్ట్‌ను చూసి తెరకెక్కిస్తాను, ఈ పోస్ట్ తనపై మరింత బాధ్యతను పెరిగిందన్నారు. ‘‘నేను ఎన్నో ఏళ్ల క్రితం, ఎన్నో కలలతో ఒక చిన్న సూట్‌కేస్ పట్టుకొని ముంబయికి వచ్చాను. ఆ టైంలో రామ్‌గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్‌గా పని చేసినా చాలనుకున్నాను. కానీ ఈరోజు ఆయనే నా సినిమాపై ఇలా పోస్ట్ పెట్టడం నమ్మలేకపోతున్నా’’ అని రిప్లై ఇచ్చారు. డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే దేశవ్యాప్తంగా రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డులు బద్దలు కొట్టింది. ఈ చిత్రంలో రణ్వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, ఆర్.మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ తదితరులు నటించారు.
READ ALSO: Maoists: డీజీపీ ఎదుట 40 మంది మావోయిస్టులు లొంగుబాటు..