Revanth Reddy-PM Modi: జాతీయ ప్రయోజనాలే ముఖ్యం.. ప్రధాని మోడీకి సీఎం రేవంత్ లేఖ!
- మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్‌పై ప్రధాని మోడీకి సీఎం రేవంత్ లేఖ
- మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ వేర్వేరు అంశాలు
- మహిళా కోటాను తక్షణమే అమలు చేస్తే దేశమంతా దానిని స్వాగతిస్తుంది
- డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలతో పాటు చిన్న రాష్ట్రాలకు అన్యాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళా రిజర్వేషన్లు, లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ వేర్వేరు అంశాలని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ల అమలును ఆలస్యం చేయకూడదని అభిప్రాయపడ్డారు. సీఎం రేవంత్ తన లేఖలో మహిళా రిజర్వేషన్లకు దేశవ్యాప్తంగా విస్తృత మద్దతు ఉందని పేర్కొన్నారు. రాష్ట్రాల వారీగా అసెంబ్లీ స్థానాల్లో మహిళా కోటాను తక్షణమే అమలు చేస్తే, దేశమంతా స్వాగతిస్తుందని తెలిపారు. ఈ అంశాన్ని డీలిమిటేషన్‌తో అనుసంధానం చేయడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు.
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఆందోళనలు వ్యక్తం చేశారు. జనాభా ప్రాతిపదికన మాత్రమే డీలిమిటేషన్ చేపడితే.. దక్షిణాది రాష్ట్రాలతో పాటు చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరిగే అవకాశం ఉందన్నారు. ఈ ప్రక్రియ తాత్కాలికంగా కొన్ని రాజకీయ పార్టీలకు, ముఖ్యంగా బీజేపీకి లాభం చేకూర్చవచ్చని.. కానీ దీర్ఘకాలంలో దేశానికి నష్టం కలిగించే ప్రమాదం ఉందని తెలిపారు. పార్టీ ప్రయోజనాల కంటే జాతీయ ప్రయోజనాలే ముఖ్యమని సీఎం స్పష్టం చేశారు. లోక్‌సభ డీలిమిటేషన్ విషయంలో కేవలం జనాభా నిష్పత్తి ఆధారిత విధానాన్ని కాకుండా.. ఇతర ప్రత్యామ్నాయ నమూనాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను గౌరవిస్తూ జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయం సాధించాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ తన లేఖలో పేర్కొన్నారు. దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సమగ్ర చర్చలు జరిపి నిర్ణయం తీసుకోవాలని ప్రధాని మోడీని కోరారు.
Also Read
- Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
- APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
- Vaibhav's Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి... నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
- Pentagon Lockdown: పెంటగాన్‌లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్‌లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్‌లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!