భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ హాత్ సే హాత్ జోడో పేరుతో ములుగు నియోజకవర్గం నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అయితే.. ఈ క్రమంలోనే నేడు మహబూబాబాద్ జిల్లాలో నిర్వహించిన పాదయాత్రలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఎవరూ సంతోషంగా లేరని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. వృద్దులకు పెన్షన్లు ఇచ్చే దిక్కు లేదని వాళ్లు గోడు వెళ్లబోసుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. ఇందిరమ్మ ఇచ్చిన పోడు భూములను హరితహారం పేరుతో గుంజుకుంటున్నారని, ఈ ఊర్లో ఒక దుశ్శాసన ఎమ్మెల్యే ఉన్నాడని, ఆ దుశ్శాసనుడు కలెక్టరమ్మ చేయిపట్టి లాగాడని ఆయన ఆరోపించారు. మెడికల్ కాలేజీ పేరుతో పేదల భూములు గుంజుకున్నాడని, పేదల భూములను కుటుంబ సభ్యుల పేర్లతో రాయించుకున్నారని చెబుతున్నారని ఆయన విమర్శించారు. ఇక్కడ రాక్షస పాలన సాగుతోందని విమర్శించారు రేవంత్ రెడ్డి. కలెక్టర్లకు, కౌన్సిలర్లకు, పోడు భూములకు, పేదలకు ఇక్కడ రక్షణ లేదని ఆయన ధ్వజమెత్తారు. నకిలీ విత్తనాలతో మిర్చి రైతులను మోసం చేసిన వారిపై పీడీ వ్యక్తులు ఎందుకు పెట్టరు? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అప్పుల బాధతో 29 మంది రైతులు పురుగుల మందు తాగి చనిపోయారన్నారు.
Also Read : Off The Record: అధినేత దృష్టిలో పడేందుకే ప్రయారిటీ..! మంత్రిపై అధిష్టానికి ఫిర్యాదులు..
ఈ దుర్మార్గాలకు, పాపాలకు కారణం కేసీఆర్ అని ప్రజలు నా దృష్టికి తెచ్చారని, జనవరి 1, 2024 లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందన్నారు. 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం అర్హులైన ఆదివాసీ, గిరిజనులకు పట్టాలిస్తామన్నారు రేవంత్ రెడ్డి. వారి ఆత్మ గౌరవాన్ని నిలబెడతామని, భూ నిర్వాసితులందరికి నష్టపరిహారం ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. చనిపోయిన 50మంది ఆర్టీసీ కార్మికుల ఉసురు కేసీఆర్‌కు తగులుతుందని, 40వేల ఆర్టీసీ కార్మికులను చూసుకునే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. పోలీసులకు ప్రతీ వారం సెలవు ఇచ్చి.. ప్రతీ నెల1వ తేదీన జీతాలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీదని, హోమ్ గార్డుల సమస్యలు తీరుస్తామన్నారు రేవంత్ రెడ్డి. మహబూబాబాద్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని, తొమ్మిదేళ్లయినా ఆ హామీని నిలబెట్టుకోలేదని మండిపడ్డారు రేవంత్ రెడ్డి.
Also Read : Revanth Reddy : రాష్ట్రంలో పాలన చూస్తుంటే రజాకార్లు మళ్లీ వచ్చినట్లు ఉంది