Revanth Reddy : ఆదివాసీలు, లాంబాడాలు కాంగ్రెస్‌కు రెండు కళ్లలాంటివారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ నేడే నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆదివాసీలు, లాంబాడాలు కాంగ్రెస్‌కు రెండు కళ్లలాంటివారన్నారు. తెలంగాణలో 12 అసెంబ్లీ స్థానాల్లో 6 లాంబాడాలకు, 6 ఆదివాసీలకు ఇవ్వాలని నిర్ణయించిందని, బలరాం నాయక్ పెద్దమనసుతో ఆదివాసీ బిడ్డకోసం ఇల్లందు సీటు వదులుకుండన్నారు. పదవి కంటే ప్రజలకు మేలు జరగడం ముఖ్యమని ఆయన తన ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేసారని, ఓటు చీలిపోకుండా కూడాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ వచ్చి పదేళ్లయినా బోథ్ కు నీళ్లేందుకు రాలేదు? అని, ఇక్కడి ప్రజలకు పోడు భూములకు పట్టాలు ఎందుకివ్వలేదు? అని ఆయన అన్నారు.
తండాలను పంచాయితీలు చేశామని చెప్పుకునే కేసీఆర్ ఎన్ని పంచాయతీలకు భవనాలు కట్టించారు? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. గ్రామసర్పంచులకు వేల కోట్ల బకాయిలు ఇవ్వక ప్రభుత్వం వారిని ఆత్మహత్యలకు ఉసిగొల్పిందని, కేసీఆర్ తన మేధస్సును రంగరించి కాళేశ్వరం కట్టిన అని చెప్తుండని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కట్టిన మేడిగడ్డ మూడేళ్లలో కుంగిపోయింది… అన్నారం పగిలిపోయిందని ఆయన విమర్శించారు. బోథ్ కు నీళ్లు రాకపోవడానికి ఈ దద్దమ్మ సీఎం కేసీఆరే కారణమని, ఇక్కడి కుఫ్టీ ప్రాజెక్టు పూర్తి కావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు రేవంత్ రెడ్డి. బోథ్ కు డిగ్రీ కాలేజీ రావాలంటే ఈ గడ్డపై కాంగ్రెస్ గెలవాలని, ఒక్కసారి ఈ బోథ్ గడ్డపై కాంగ్రెస్ ను గెలిపించండని ఆయన కోరారు.
Also Read
- Hypnic Jerk: నిద్రలో ఒక్కసారిగా కిందపడుతున్నట్లు అనిపిస్తోందా? మెదడులో ఏం జరుగుతుంది.?
- Google Birthday Sale: గూగుల్ పుట్టిన రోజు ధమాకా.. స్మార్ట్ఫోన్లు, వాచ్‌లు, ఇయర్‌బడ్స్‌పై భారీ డిస్కౌంట్లు..
- LNG Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. దేశంలో తొలి LNG రైలుకు గ్రీన్ సిగ్నల్..
- Bank Strike: సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల బ్యాంక్ సమ్మె.. కారణం ఇదే
డిసెంబర్ 31లోపు బోథ్ ను రెవెన్యూ డివిజన్ చేసే జిమ్మేదారి నాది అని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కుఫ్టీ ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేసి ప్రారంభోత్సవానికి వచ్చే బాధ్యత నాది అని, ఆదిలాబాద్ నుంచి అచ్ఛంపేట అడవుల వరకు కాంగ్రెస్ ను గెలిపించండని ఆయన అన్నారు. ఆదిలాబాద్ ను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామని, దొరలపాలన పోవాలి.. ఇందిరమ్మ రాజ్యం రావాలని ఆయన నినదించారు. అప్పుడే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని, మాట తప్పని మడమ తిప్పని నాయకురాలు సోనియమ్మ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. సోనియమ్మ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామని, కాంగ్రెస్ ఆరు గ్యారంటీలతో కేసీఆర్ వెన్నులో వణుకు పుట్టిందన్నారు రేవంత్ రెడ్డి.
తాజావార్తలు
-
Hypnic Jerk: నిద్రలో ఒక్కసారిగా కిందపడుతున్నట్లు అనిపిస్తోందా? మెదడులో ఏం జరుగుతుంది.?
-
RummyCulture Case :రమ్మీకల్చర్‌పై ఈడీ కొరడా.. రూ.442 కోట్ల ఆస్తులు అటాచ్!
-
Google Birthday Sale: గూగుల్ పుట్టిన రోజు ధమాకా.. స్మార్ట్ఫోన్లు, వాచ్‌లు, ఇయర్‌బడ్స్‌పై భారీ డిస్కౌంట్లు..
-
Venkatesh: “20 ఏళ్ల తర్వాత మళ్లీ త్రివిక్రమ్‌తో .. పెళ్లికాని ప్రసాద్ కాలం పోయింది”
-
Trivikram Srinivas: ‘ఆయన అంటే గౌరవంతో కూడిన ఇష్టంతో వచ్చిన భయం’ వెంకీ మామపై త్రివిక్రమ్ వైరల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?