Thummala Nageswara Rao: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. పంటల రక్షణ కోసం కొత్త స్కీం..!
- తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో గుడ్ న్యూస్
- అడవి జంతువులు, కోతుల నుండి పంటల రక్షణకు..
- సోలార్ పెన్సింగ్ స్కీంను ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం- మంత్రి తుమ్మల
- పామాయిల్ తో పాటు ఇతర పంటలకు డ్రిప్, తుంపర సేద్య పరికరాలను..
- అవసరం మేరకు రైతులకు అందించాలని మంత్రి అధికారులకు ఆదేశాలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పనుంది. పంటల రక్షణ కోసం కొత్త స్కీం తీసుకురానుంది. దీంతో పాటు.. రైతుల అవసరాలకు సంబంధించిన పరికరాలను అందించే యోచనలో సర్కార్ ఉన్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. అడవి జంతువులు, కోతుల నుండి పంటల రక్షణకు సోలార్ పెన్సింగ్ స్కీంను ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు మంత్రి తుమ్మల పేర్కొన్నారు. అంతేకాకుండా.. పామాయిల్‌తో పాటు ఇతర పంటలకు డ్రిప్, తుంపర సేద్య పరికరాలను అవసరం మేరకు రైతులకు అందించాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో పాటు.. రాష్ట్ర అవసరాలు తీర్చే విధంగా కూరగాయల సాగు పెంపునకు పెరి అర్బన్ క్లస్టర్లను ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు.
Read Also: Manchu Manoj: మంచు మనోజ్ కంటికి గాయం?
Also Read
జూన్ మొదటి వారంలోపు రాష్ట్రంలో మరో ఆయిల్ పామ్ కర్మాగారం అందుబాటులోకి రానుందని.. మరో రెండు ఫ్యాక్టరీల నిర్మాణ పనులు ఆరంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. అలాగే.. మెకడమియా పంట సాగుకు అవసరమైన పరిస్థితులను.. అనువైన ప్రాంతాలను అధ్యయనం చేయాల్సిందిగా ఉద్యానశాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రగతి చూపని ఆయిల్ పామ్ కంపెనీలపై చర్యలు ఆరంభించాలని.. ఇప్పటికే విశ్వతేజ ఆయిల్ పామ్ కంపెనీకి ఇచ్చిన అనుమతులు రద్దు చేసినట్లు మంత్రి తుమ్మల పేర్కొన్నారు.
Read Also: Fact Check: రోహిత్ శర్మకు పాకిస్థాన్‌లో కూడా అంత క్రేజ్ ఉందా? ఈ వైరల్ వీడియోలో నిజమెంత?
ఇదిలా ఉంటే.. రైతులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం తాజాగా రైతు భరోసా నిధులను విడుదల చేసిన సంగతి తెలిసిందే.. మొత్తం మూడు ఎకరాల వరకు సాగులో ఉన్న భూములకు రైతు భరోసా నిధులు జమ చేశారు. మొదటగా ఒక ఎకరం ఉన్నవారికి, మరోసారి రెండు ఎకరాలు ఉన్నవారికి, ఈనెల 12న మూడు ఎకరాల ఉన్న రైతుల అకౌంట్లో రైతు భరోసా నిధులను జమ చేసింది.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!