NTV Telugu Site icon

Revanth Reddy: హరీష్ రావు వ్యాఖ్యల వల్లే రైతు బంధు ఆగింది..

Revanth Reddy

Revanth Reddy

తెలంగాణలో రైతు బంధు విడుదల చేసేందుకు ఎన్నికల కమిషన్ ఇచ్చిన పర్మిషన్ ను క్యాన్సిల్ చేసింది. దీనిపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ (ఎక్స్) వేదికగా స్పందించారు. రైతు బంధుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ, ఆత్రుత, అహంకారం తప్ప నిజంగా రైతులకు మేలు జరగాలన్న ఉద్దేశ్యం మామా – అల్లుళ్లకు లేదని ఆయన విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు వ్యాఖ్యల కారణంగానే రైతు బంధుకు ఇచ్చిన అనుమతిని ఎన్నికల కమిసన్ ఉపసంహరించుకుంటున్నట్టు ఆదేశాలు ఇవ్వడమే దీనికి నిదర్శనం అని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ ద్రోహులను ఇంటికి పంపితే తప్ప రైతులకు న్యాయం జరగదని వ్యాఖ్యనించారు. రాష్ట్రంలో రైతులు ఆందోళన చెందవద్దు.. పది రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 15 వేల రూపాయల రైతు భరోసా మీ ఖాతాల్లో వేస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు.

Read Also: MLC Kavitha: రైతు బంధు ఆపింది కాంగ్రెస్సే.. రైతు వ్యతిరేక పార్టీగా రుజువు చేసుకున్నారు

అయితే, రైతుబంధు పంపిణీకి ఎన్నికల కమిసన్ (ఈసీ) ఇచ్చిన అనుమతిని కేసీఆర్ ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేదు. ఏదో ప్రయోజనం కోరి చివరి వరకూ రైతు బంధును పంపిణీ చేయకుండా నిలిపి వేస్తే.. ఈలోగా ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో రైతుబంధుకు ఇచ్చిన అనుమతిని ఈసీ వెనక్కి తీసుకుంది. ఈ నెల 24 నుంచి రైతుబంధు అనుమతికి ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇచ్చింది. అయితే, సీఈసీ నిబంధనలను తెలంగాణ ప్రభుత్వం ఉలంగించినందుకు అనుమతి రద్దు చేసింది.. ఈసీ అనుమతి ఇచ్చిన తర్వాత మంత్రి హరీష్ రావు ఓ సభలో మాట్లాడుతూ.. మంగళవారం నాడు ఉదయం రైతులు చాయ్ తాగే సమయానికి మీ ఫోన్లలో టింగ్ టింగ్ టింగ్ టింగ్ అంటూ రైతు బంధు పడ్డ మెస్సేజ్ లు వస్తాయని కామెంట్స్ చేశారు.. వీటికి పరిగణలోకి తీసుకున్న ఈసీ రైతు బంధు పర్మిషన్ ను రద్దు చేసింది.