Revanth Reddy : మోడీని ఓడించి.. రాహుల్‌ని ప్రధాని చేయాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కార్యకర్తలు రక్తం చెమటగా మార్చడం తోనే నేను సీఎం గా గౌరవం దక్కిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కాంగ్రెస్ బహిరంగ సభలో ముఖ్య అతిథిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభం అయ్యాకా.. కర్ణాటక.. హిమాచల్ ప్రదేశ్.. మూడో విజయం తెలంగాణ అని ఆయన వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే కాగానే ఆరు నెలలు కాకముందే మంత్రి కాలేదని అనుకునే రోజులు ఇవి అని, 2004లో ఎంపీ గా ఎన్నికైన రాహుల్ గాంధీ.. రెండు సార్లు ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా త్యాగం చేసింది రాహుల్ గాంధీ అని ఆయన కొనియాడారు. త్యాగం అంటే రాహుల్ గాంధీది అని, దేశ భక్తి అంటే గాంధీ కుటుంబంది అని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ నాయకులు ఎవరైనా దేశం కోసం ప్రాణాలు ఇచ్చారా..? అని ఆయన ప్రశ్నించారు. మూడు తరాలు ప్రధాని అయిన కుటుంబం కి ఇల్లు కూడా లేదని, అలాంటి కుటుంబం పై అక్రమ కేసులు పెడుతున్నాడు మోడీ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బిళ్ళా రంగడు ఇద్దరు ఊరు ఊరు తిరుగుతున్నారని, చార్లెస్ శోభ రాజ్ ఇంట్లో పడుకున్నాడని ఆయన విమర్శలు గుప్పించారు.
అంతేకాకుండా.. ‘సరిగ్గా మేము గెలిచి 50 రోజులు కాలేదు. ఏమైంది ఇంకా హామీలు అమలు కాలేదు అంటున్నారు. 100 రోజుల్లో హామీలు అమలు చేస్తాం. ఫిబ్రవరి మొదటి వారంలో ఇంకో రెండు హామీలు అమలు లోకి వస్తాయి. ఫిబ్రవరి నెలాఖరు వరకు రైతు బంధు. రేవంత్ మేస్ట్రీ నే. మీరు విధ్వంసం చేసిన తెలంగాణ నిర్మించే మేస్త్రీని, మిమ్మల్ని గోరి కట్టే మేస్త్రీని నేనే, ఇందిరమ్మ ఇంట్లో ఉన్న వాళ్ళను ఎమ్మెల్యే చేసింది కాంగ్రెస్. కేసీఆర్.. నువ్వు రాజ్య సభ కి ఎవర్ని పంపినవు. కరోనా సమయలో 500 కోట్లు మింగిన పార్థసారథి ని కదా పంపింది. ఇంద్రవెళ్లి నుండి అసలు సినిమా. ఇప్పటి వరకు ఇంటర్వెల్ మాత్రమే. మనం సచ్చినా..శత్రువుని చంపడం ముఖ్యం. కేసీఆర్ మారు బేరగాడు. ఇక్కడ గెలిచినా.. అక్కడికి వెళ్లి మోడీకి మద్దతు ఇస్తరూ’ అని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.
Also Read
- RCB Vs GT: నిప్పలు చెరుగుతున్న బెంగళూరు బౌలర్లు.. పెవిలియన్‌కు చేరిన ఓపెనర్స్..
- RCB vs GT Final: గుజరాత్ బ్యాటింగ్.. బెంగళూరు బౌలింగ్.. గుజరాత్ టీంలో కీలక మార్పులు..
- West Bengal: మమతకు భారీ షాక్.. 80 మందిలో 20 మంది ఎమ్మెల్యేలే హాజరు!
- IPL 2026 Prize Money: ఛాంపియన్‌కు రూ.20 కోట్లు.. మరి SRH, రాజస్థాన్ జట్లకు దక్కిన ప్రైజ్ మనీ ఎంతంటే?
తాజావార్తలు
-
RCB Vs GT: నిప్పలు చెరుగుతున్న బెంగళూరు బౌలర్లు.. పెవిలియన్‌కు చేరిన ఓపెనర్స్..
-
LIC: ఎల్ఐసీ కొత్త వ్యూహం.. ఫిన్‌టెక్ రంగంలోకి ఎంట్రీ? ఫోన్‌పే, పేటీఎంకు పోటీగా సేవలు!
-
RCB vs GT Final: గుజరాత్ బ్యాటింగ్.. బెంగళూరు బౌలింగ్.. గుజరాత్ టీంలో కీలక మార్పులు..
-
Kodak QLED SE 80 cm: తక్కువ ధరలో QLED అనుభవం.. Kodak స్మార్ట్ టీవీపై రూ. 10 వేల డిస్కౌంట్
-
Online Cybersecurity Course: ఫ్రాడ్గాళ్లకు చెక్.. ఈ 150నిమిషాల ఫ్రీ కోర్సు నేర్చుకుంటే మీ జేబు చాలా సేఫ్!
ట్రెండింగ్
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!