NTV Telugu Site icon

Revanth Reddy: హైదరాబాద్‌కి స్వాతంత్రం ఇప్పించిన పార్టీ కాంగ్రెస్

Revanth Reddy

Revanth Reddy

మరోసారి టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడ్డారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17 పై టీఆర్‌ఎస్, బీజేపీ లు డ్రామాలు అడుతున్నాయన్నారు. హైదరాబాద్‌కి స్వాతంత్రం ఇప్పించిన పార్టీ కాంగ్రెస్ అని ఆయన విమర్శించారు. మన పేటెంట్‌ని గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మైనార్టీలకు రక్షణ కల్పిస్తున్నామని కేసీఆర్, మెజారిటీ ప్రజలకు అండగా ఉన్నామని బీజేపీ నాటకాలు అడుతున్నాయన్నారు. ముస్లింలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం కాదు.. రాచరికనికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం అని ఆయన అన్నారు. అంతేకాకుండా.. సెప్టెంబర్ 17 2022 – సెప్టెంబర్ 17 2023 వరకు వజ్రోత్సవాలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుందని, తెలంగాణను కేసీఆర్ తెచ్చారని ప్రజల్లో భ్రమ కల్పిస్తున్నారన్నారు. ఉద్యమంలో వాహనాలకు టీజీ ఉంది.. కానీ రాష్ట్రం ఏర్పడిన తరువాత వారి పార్టీకి గుర్తుగా దానిని టీఎస్‌గా మార్చారన్నారు.

 

మనం వచ్చిన తరువాత దానిని టీజీగా మారుస్తామని రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. అందే శ్రీ రాసిన జయ జయహే తెలంగాణను రాష్ట్ర విభజన జరిగిన తరువాత దానిని పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ వచ్చిన తరువాత అందే శ్రీ రాసిన జయ జయహే తెలంగాణను అధికార గీతంగా చేస్తామని రేవంత్‌ రెడ్డి వెల్లడించారు. టీఆర్‌ఎస్ సృష్టించిన తెలంగాణ తల్లి కాకుండా.. సబ్బడ్డ వర్గాలకు సంబంధించిన తెలంగాణ తల్లిని గ్రామగ్రామాన విగ్రహాలు ప్రతిష్ఠిస్తామని, పక్క రాష్ట్రాల్లో జాతీయ జెండాతో పాటు రాష్ట్ర ప్రభుత్వంకి ప్రత్యేక ఫ్లాగ్ ఉంటుంది..మనం వచ్చిన తరువాత తెలంగాణ రాష్ట్రానికి కూడా ప్రత్యేక ఫ్లాగ్ రూపొందిస్తామన్నారు రేవంత్‌ రెడ్డి.