Site icon NTV Telugu

CM Revanth Reddy: జూబ్లీహిల్స్‌లో డిపాజిట్ వస్తే.. బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లో బీజేపీ గెలిచినట్టే..

Cm1

Cm1

CM Revanth Reddy: 2034 జూన్ వరకు తెలంగాణ లో కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నేను కాంగ్రెస్ కార్యకర్తను.. ఏ ఎన్నిక వచ్చిన కోట్లాడత.. నాది లీడర్ మనస్తత్వం కాదు.. క్యాడర్ మనస్తత్వం అన్నారు. డోర్ టు డోర్ కూడా తిరుగుతానని స్పష్టం చేశారు. సెక్యూరిటీ అనుమతి ఇవ్వడం లేదు కానీ.. ఇస్తే ఇల్లు ఇల్లు తిరుగుతానన్నారు. నాకు ఓపిక.. వయసు ఉందని చెప్పారు. అనంతరం సీఎం రేవంత్‌ బీజేపీ నాయకులపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. బీజేపీ ఫైర్ బ్రాండ్ ఎంపీలైన ధర్మపురి అరవింద్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారానికి ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్‌ మీద కోపంతో ఉన్న నాయకులను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రచారానికి పిలవలేదన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను ఎందుకు ప్రచారానికి పిలవలేదు. చివరి క్షణంలో ఎందుకు పిలిచారని నిలదీశారు. చిన్ని చిన్న ఎన్నికల ప్రచారానికి ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులైన యోగి ఆధిత్యానాథ్, హిమంత్, రేఖా గుప్తను తీసుకొచ్చే మీరు.. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారానికి ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు.

READ MORE: IPL 2026-CSK: ఐపీఎల్ 2026 వేలంకు ముందే సంచ‌ల‌నం.. సీఎస్‌కేలోకి సంజు, జడేజా ఔట్!

బీజేపీ బీఆర్ఎస్‌కు సపోర్టు చేస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. “ఎందుకు కిషన్‌రెడ్డి కాళ్లేశ్వరం అవినీతి మీద మాట్లాడటం లేదు. బీఆర్ఎస్ ఫార్ములా ఈ రేస్‌మీద ఎందుకు మాట్లాడటం లేదు. బీజేపీది హిందూ ఎజెండా కదా.. సెక్రటేరియట్‌లో అమ్మవారి గుడిని కూలగొట్టి తరలించారు. ఈ అంశంపై ఎందుకు ప్రశ్నించలేదు. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన దేవత గుడిని కూలగొడితే ఎందుకు మాట్లాడలేదు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. సినిమా ఇంటర్వేల్‌కి కూడా రాలేదు. కానీ.. ఈ సినిమా ఎటు పోతుందో మనకు అర్థమవుతోంది. హిందువులంతా తమకు ఓటేయమని బండి సంజయ్ అన్నారు. డి పాజిట్ పోతే హిందువులు బీజేపీతో లేరని వాళ్లు ఒప్పుకున్నట్లే కదా..? ఇప్పుడు డిపాజిట్‌ వస్తే.. ఈ దేశంతో పాటు పక్కదేశాలైన బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లో కూడా బీజేపీ గెలిచినట్లే. జూబ్లీహిల్స్‌లో ఎలాగైనా డిపాజిట్లు తెచ్చుకోండి.” అని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

Exit mobile version