IND Vs PAK: పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం.. ధావన్ హాఫ్ సెంచరీతో మెరుపులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జాంబియా వేదికగా జరుగుతున్న ఏషియన్ లీజెండ్స్ లీగ్‌లో ఇండియన్ రాయల్స్ జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో పాకిస్థాన్ ప్యాంథర్స్ జట్టును 2 వికెట్ల తేడాతో భారత్ ఓడించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ లీజెండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసి, భారత్ ముందు 168 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. పాకిస్థాన్ తరఫున ఇమ్రాన్ నజీర్ 29 బంతుల్లో 47 పరుగులతో రాణించగా, భారత బౌలర్లు చివరి ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి వారిని తక్కువ స్కోరుకే పరిమితం చేశారు.
అనంతరం 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియన్ రాయల్స్ ఆరంభంలోనే ఓపెనర్లు నమన్ ఓజా, అభిషేక్‌ల వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే, ఆ తర్వాత వచ్చిన రిషి ధావన్ (33 బంతుల్లో 50 పరుగులు), సారుల్ (29 బంతుల్లో 46 పరుగులు) బాధ్యతాయుతంగా ఆడి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. వీరిద్దరూ అవుటైన తర్వాత భారత జట్టు వరుసగా వికెట్లు కోల్పోయి మళ్లీ ఒత్తిడిలో పడినప్పటికీ, ఆఖరి వరుస బ్యాటర్లు బాధ్యతాయుతంగా ఆడి మరో 14 బంతులు మిగిలి ఉండగానే 17.4 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించారు.
Also Read
- Nethanna Bharosa: పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే వారికి శుభవార్త.. దరఖాస్తులో ఆ నిబంధన మినహాయింపు..
- Smart Watches: AMOLED డిస్ప్లే, రఫ్ అండ్ టఫ్ లుక్.. తక్కువ ధరల్లో స్మార్ట్‌వాచ్‌లు అందుబాటులోకి..
- Saudi-Trump: హౌతీలపై దాడులు చేయాలని ట్రంప్‌కు సౌదీ విజ్ఞప్తి.. అధ్యక్షుడు షాకింగ్ రియాక్షన్
- Putin Car: బుల్లెట్లు, బాంబులు ఏం చేయలేవు.. పుతిన్ ‘‘ఆరస్ సెనాట్’’ కారు ప్రత్యేకతలు ఇవే..
ఈ విజయంతో టోర్నీలో ఇండియన్ రాయల్స్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. అంతకుముందు జరిగిన తొలి మ్యాచ్‌లో భారత జట్టు బంగ్లాదేశ్ టైగర్స్ పై 19 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. జూలై 30న ప్రారంభమైన ఈ ఏషియన్ లీజెండ్స్ లీగ్ రెండవ సీజన్ ఫైనల్ మ్యాచ్ ఆగస్టు 10న జరగనుంది. భారత్ జట్టులో శిఖర్ ధావన్, సురేష్ రైనా, హర్భజన్ సింగ్, దినేష్ కార్తీక్, అంబటి రాయుడు వంటి పలువురు దిగ్గజ ఆటగాళ్లు భాగస్వాములుగా ఉన్నారు. భారత అభిమానులకు ఎంతగానో ఆసక్తిని పంచిన ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌ను ఫ్యాన్‌కోడ్ యాప్, సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేశాయి.
తాజావార్తలు
-
Nethanna Bharosa: పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే వారికి శుభవార్త.. దరఖాస్తులో ఆ నిబంధన మినహాయింపు..
-
Harish Rao : కేసీఆర్ పాలనలో పరిష్కారాలు.. రేవంత్ సర్కార్‌లో సమస్యలే
-
Smart Watches: AMOLED డిస్ప్లే, రఫ్ అండ్ టఫ్ లుక్.. తక్కువ ధరల్లో స్మార్ట్‌వాచ్‌లు అందుబాటులోకి..
-
Saudi-Trump: హౌతీలపై దాడులు చేయాలని ట్రంప్‌కు సౌదీ విజ్ఞప్తి.. అధ్యక్షుడు షాకింగ్ రియాక్షన్
-
Putin Car: బుల్లెట్లు, బాంబులు ఏం చేయలేవు.. పుతిన్ ‘‘ఆరస్ సెనాట్’’ కారు ప్రత్యేకతలు ఇవే..
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?