Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Revanth Reddy Announced That The Loan Will Be Waived On The Basis Of The Pass Book

Revanth Reddy: పాస్ బుక్ ఆధారంగానే రుణమాఫీ..రేషన్ కార్డుకు సంబంధం లేదు..

Published Date :July 18, 2024 , 5:41 pm
By RAMAKRISHNA KENCHE
  • రుణాలు తీసుకున్న దాదాపు 6.36 లక్షల మందికి రేషన్‌ కార్డులు లేవన్న సీఎం
  • అందుకే పాస్‌బుక్‌ ఆధారంగా రుణమాఫీ చేశామని ప్రకటన
  • రాష్ట్ర వ్యాప్తంగా 110 రైతు వేదికల్లోని రైతులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రైతులతో మాట్లాడిన సీఎం
  • మరోసారి రాహుల్ గాంధీతో వరంగల్ లో భారీ బహిరంగ సభ పెడదామని సీఎం వెల్లడి
Revanth Reddy: పాస్ బుక్ ఆధారంగానే రుణమాఫీ..రేషన్ కార్డుకు సంబంధం లేదు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

పాస్ బుక్ ఆధారంగానే రుణమాఫీ చేస్తామని.. రేషన్ కార్డుకు సంబంధం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కుటుంబాన్ని నిర్ధరించేందుకే రేషన్‌ కార్డు అన్నారు. రుణాలు తీసుకున్న దాదాపు 6.36 లక్షల మందికి రేషన్‌ కార్డులు లేవని ఆయన తెలిపారు. అందుకే పాస్‌బుక్‌ ఆధారంగా రుణమాఫీ చేస్తున్నామని వెల్లడించారు. గురువారం సాయంత్రం సచివాలయంలో తొలివిడత రుణమాఫీ ప్రారంభించారు. మొదటి విడతలో భాగంగా రూ.1 లక్ష లోపు రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 110 రైతు వేదికల్లోని రైతులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సచివాలయం నుంచి ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ మాట ఇస్తే తప్పే ప్రసక్తే లేదని.. కాంగ్రెస్ మాటే శిలాశాసనమని మరోసారి రుజువైందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. మొత్తం 11.50 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.6,098 కోట్ల నగదు జమ చేసినట్లు తెలిపారు. ఆర్థికశాఖ ఇప్పటికే బ్యాంకులకు నగదు జమ చేసింది.

READ MORE:Viral video: కారు రన్నింగ్‌లో ఉండగా మహిళలు డ్యాన్సులు.. పోలీసులు ఏం చేశారంటే..!

వరంగల్ జిల్లాకు చెందిన ఓ రైతుతో మాట్లాడారు. ఈ సందర్భంగా మరోసారి వరంగల్ జిల్లాలో రైతులతో సభ నిర్వహిద్దామా..? అని రైతును సీఎం అడిగారు. మీరు ఒప్పుకుంటే మరోసారి రాహుల్ గాంధీని కలిసి త్వరలో అయిదు లక్షల మంది రైతులతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేద్దామని రేవంత్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం రుణమాఫీ అమలు చేస్తామని ఐదేళ్లు కాలయాపన చేసిందని ముఖ్యమంత్రి అన్నారు. రుణమాఫీ పథకం సరిగా అమలు చేయలేదన్నారు. డిక్లరేషన్‌లో భాగంగా రైతులకు రుణమాఫీ చేస్తున్నామని వెల్లడించారు. హామీ మేరకు ఈ నెలా చివరి కల్లా నాటికి రూ.లక్షన్నర వరకు ఉన్న రైతు రుణాలను మాఫీ చేస్తామని మరోసారి గుర్తు చేశారు. గత ప్రభుత్వం రూ.7లక్షల కోట్లు అప్పులు చేసిందని.. దీనికి ప్రతి నెలా రూ.7వేల కోట్లు వడ్డీ చెల్లిస్తున్నామన్నారు. జీతాలు, పింఛన్ల కోసం రూ.5వేల కోట్లు కేటాయిస్తున్నామని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే వివిధ పథకాల కోసం రూ.29 వేల కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. మొత్తం మూడు విడతల్లో రూ.31 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని రైతులకు తీపి కబురు చెప్పారు. అనంతరం పలువురు రైతులకు చెక్కులు అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీకి సంబంధించిన నమూనా చెక్కును విడుదల చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Chief minister Revanth reddy
  • farmer loan waiver
  • LATEST TELUGU NEWS
  • loan will be waived on the basis of the pass book
  • Minister Tummala Nageswara Rao

తాజావార్తలు

  • Congress: రాహుల్ గాంధీకి సొంత పార్టీలోనే షాక్.. మోడీ సర్కార్‌కు కాంగ్రెస్ సీనియర్ల మద్దతు..

  • US-Iran War: “మేము మీలా క్రూరులం కాదు”.. అమెరికన్ పైలట్ తల్లి బాధపై స్పందించిన ఇరాన్..

  • SRH: సన్ రైజర్స్ హైదరాబాద్‌కు బిగ్ షాక్.. ఇంటికెళ్లిపోయిన స్టార్ ప్లేయర్..

  • Minister Atchannaidu: గతంలో మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారు..! ఇప్పుడు ‘మావిగన్’ పేరుతో జగన్‌ మరో నాటకం..!

  • Varanasi: క్లైమాక్స్‌కు చేరువలో ‘వారణాసి’..హైదరాబాద్ శివార్లలో షూటింగ్

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions