ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ తమ జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా థాయిలాండ్ సందర్శించాలని కలలు కంటారు. స్ట్రీట్ ఫుడ్, అందమైన బీచ్‌లు, ఉత్సాహభరితమైన నైట్ లైఫ్ కి ప్రసిద్ధి చెందిన థాయిలాండ్ ఇప్పుడు మద్యపానానికి సంబంధించి కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఈ నియమాలను ఉల్లంఘించిన వారికి భారీ జరిమానాలు విధించనుంది. కొత్త నియమాలు థాయిలాండ్ సందర్శించే మద్యపాన ప్రియులకు సమస్యను సృష్టించాయి. సాధారణంగా, పర్యాటకులు వారి సౌలభ్యం మేరకు వీధి ఆహారంతో మద్యం ఆస్వాదిస్తారు. అయితే, ఇప్పుడు థాయిలాండ్‌లో నిర్ణీత మద్యపాన సమయాలు ఉన్నాయి.
Also Read:Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. పలు అంశాలపై కీలక నిర్ణయాలు!
నిబంధనల ప్రకారం, థాయిలాండ్‌లో మధ్యాహ్నం 2:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు మద్యం సేవించడం నిషేధించారు. సవరించిన మద్య పానీయాల నియంత్రణ చట్టం నవంబర్ 8న అమలులోకి వచ్చింది. ఉల్లంఘించిన వారికి 10,000 బట్ భారీ జరిమానా విధిస్తారు. ఇది భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.27,357. ఈ ఉత్తర్వు ప్రకారం, ఎవరైనా మధ్యాహ్నం 1:59 గంటలకు బీరు కొనుగోలు చేసి, 2:05 గంటల వరకు బీరు తాగితే, అది ఉల్లంఘనగా పరిగణించి జరిమానా విధిస్తారు. ఈ నిర్ణయం వల్ల వ్యాపారం నష్టపోతుందని రెస్టారెంట్ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.