దేశంలో ఎన్నికల నగారా మోగింది. . దేశంలో 96.8 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. పురుష ఓటర్లు 49.7 కోట్లు కాగా, మహిళలు 47.1 కోట్ల మంది ఉన్నారని ఎన్నికల సంఘం తెలిపింది.
ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు నాలుగు దశల్లో జరగనుండగా, మే 13 (సోమవారం), మే 20 (సోమవారం), మే 25 (శనివారం), జూన్ 1 (శనివారం) తేదీల్లో పోలింగ్ జరుగుతుందని ఎన్నికల సంఘం (ఈసీ) ఈరోజు ప్రకటించింది.
లోక్‌సభ ఎన్నికల తేదీ ప్రకటనకు కొన్ని రోజుల ముందు ఎన్నికల సంఘం నుంచి వైదొలగాలని మాజీ ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ శనివారం తెలిపారు.
భారతదేశ ఎన్నికల్లో మహిళా ఓటర్ల భాగస్వామ్యం క్రమంగా రాజకీయాలను శాసించే స్థాయికి ఎదుగుతోంది. పోలింగ్‌లో మహిళా ఓటర్ల భాగస్వామ్యం పెరుగుతోందని ఎన్నికల సంఘం తెలిపింది. గత కొన్నేళ్లుగా మహిళా ఓటర్ల భాగస్వామ్యం పెరిగిందని ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది.