Chhattisgarh: బోరు బావిలో బాలుడు.. 60 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చత్తీస్ గఢ్ లోని జాంజ్ గిర్ -చంపా జిల్లాలో 10 ఏళ్ల బాలుడు బోర్ బావిలో పడిన ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. పిహ్రిద్ గ్రామంలో ఇంటి వెనకాలు ఉన్న పెరట్లో ఆడుకుంటున్నరాహుల్ సాహు అనే బాలుడు నిరుపయోగంగా ఉన్న బావిలో జూన్ 10న పడిపోయాడు. అప్పటి నుంచి బాలుడిని బయటకు తీసుకువచ్చేందుకు రక్షణ చర్యలు సాగుతున్నాయి. దాదాపుగా 62 అడుగుల లోతులో ఇరుక్కున్నాడని రెస్య్కూ సిబ్బంది చెబుతోంది. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ( ఎన్డీఆర్ఎఫ్), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కెమెరాల ద్వారా బాలుడి పరిస్థితిని గమనిస్తున్నారు. జిల్లా అధికార యంత్రాంగం బాలుడిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యమంత్రి భూపేష్ భాఘేట్ రక్షణ చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
బాలుడికి రక్షించేందుకు వైద్య సిబ్బంది ఆక్సిజన్ ను అందిస్తోంది. రక్షణ చర్యల్లో కోల్ ఇండియాకు చెందిన రెస్క్యూటీం కూడా పాలు పంచుకుంటోంది. బాలుడు పడిన బోర్ కు సమాంతరంగా మరో గొయ్యిని తీసి రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే బాలుడు పడిన ప్రాంతం అంతా పెద్ద పెద్ద బండరాళ్లతో నిండి ఉండటంతో రక్షణ చర్యలకు ఇబ్బందిగా మారుతుందని అధికారులు వెల్లడిస్తున్నారు. డ్రిల్లింగ్ పనులకు పెద్ద పెద్ద బండరాళ్లు అడ్డంకిగా మారాయి. బాలుడిని బయలకు తీసేందుకు మరో 10 నుంచి 12 గంటల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే రెస్క్యూ సిబ్బందికి బాలుడు స్పందిస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. దాదాపుగా 500 మంది సిబ్బంది రక్షణ చర్యల్లో పాలుపంచుకుంటున్నారు.
Also Read
- Petrol Diesel Purchase: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక వారికి బంకుల్లో నో పెట్రోల్, డీజిల్!
- Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
- Cyber Crime: ఆన్లైన్ డేటింగ్ ఉచ్చులో మహిళా న్యాయమూర్తి.. జడ్జిగారి 'రోమాన్స్ స్కామ్' కథ వింటే నోరెళ్లబెడతారు!
- Air India Plane Crash Anniversary: 260 మంది ప్రాణాలు గాల్లో కలిసిన వేళ.. ఏడాది గడిచినా వీడని సస్పెన్స్?
ఇదిలా ఉంటే ఇది గడిచిన వారంలో రెండో సంఘటన. గుజరాత్ లో గత వారం ఏడాదిన్నర బాలుడు బోరు బావిలో పడిపోయాడు. అయితే ఆర్మీ సిబ్బంది రెస్క్యూ చేసి బాబును కాపాడింది. బాలుడు కేవలం 30 అడుగుల లోపలే చిక్కుకుపోవడంతో బాలుడిని సురక్షితంగా రక్షించారు. తాడుకు ఒక హ్యంగర్ తగిలించి బోరు బావిలోకి వదిలారు. అది బాలుడి షర్ట్ కు చిక్కుకున్న తరువాత నెమ్మదిగా పైకి లాగారు. ఈ ఘటన జరిగిన తర్వాత తాజాగా చత్తీస్ గఢ్ లో మరో బాలుడు బోరుబావిలో పడ్డాడు.
తాజావార్తలు
-
Sing Geetham Review : సింగ్ గీతం రివ్యూ.. సింగీతం ప్రయోగం ఎలా ఉందంటే?
-
SPIRIT : ప్రభాస్ కోసం అసలు సిసలైన డ్యూటీ చేస్తున్న సందీప్ రెడ్డి
-
Petrol Diesel Purchase: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక వారికి బంకుల్లో నో పెట్రోల్, డీజిల్!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Gold Rate Today: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఒక్కరోజులోనే షాకిచ్చిన బులియన్ మార్కెట్!
ట్రెండింగ్
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..