JIO Recharge: దేశంలోని ప్రవేట్ టెలికాం సంస్థలు రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా (Vi) తక్కువ ధరతో డేటా ప్లాన్‌లను అందిస్తున్నాయి. ఈ కంపెనీల రూ. 49 రీఛార్జ్ ప్లాన్‌లు ముఖ్యంగా డేటా అవసరాలను తీర్చడానికి రూపొందించబడ్డాయి. అయితే, ఈ ప్లాన్‌లలో డేటా పరిమితి, ఇతర ప్రయోజనాల్లో తేడాలు ఉన్నాయి. ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా (Vi) కంపెనీలు ఇదివరకే రూ. 49 రీఛార్జ్ ప్లాన్ ను అమలు చేస్తుండగా.. తాజాగా వాటిని ఢీ కొట్టేందుకు జియో సిద్ధమైంది. మరి రూ. 49 రీఛార్జ్ తో వినియోగదారుడి ఎలాంటి ఆఫర్స్ లభిస్తాయో ఒకసారి చూద్దామా..
Also Read: Poco X7 5G: మిడ్ రేంజ్ సెగ్మెంట్‌లో రెండు కొత్త మొబైల్స్ ను విడుదల చేసిన పోకో
రిలయన్స్ జియో యొక్క రూ.49 ప్రీపెయిడ్ ప్లాన్ 25GB డేటాతో వస్తుంది. ఇది డేటా వోచర్, కాబట్టి దీన్ని ఉపయోగించడానికి మీరు యాక్టివ్ ప్రీపెయిడ్ ప్లాన్‌ని కలిగి ఉండాలి. జియో రూ.49 ప్లాన్ వాలిడిటీ కేవలం 1 రోజు మాత్రమే. ఇదే ప్లాన్‌ను ఎయిర్‌టెల్ కూడా ప్రవేశపెట్టింది. ఎయిర్‌టెల్ కూడా దీన్ని 1 రోజు ఆఫర్ గానే అందిస్తుంది. కానీ, ఎయిర్‌టెల్ 20GB డేటాను మాత్రమే ఇస్తుంది. అచ్చం ఇలాగే మరో ప్రవేట్ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా (Vi) కూడా 20GB డేటాను మాత్రమే ఇస్తుంది. కాబట్టి.. వొడాఫోన్ ఐడియా (Vi), ఎయిర్‌టెల్ లకు ధీటుగా జియో ప్లాన్‌ల మధ్య 5GB వ్యత్యాసం ఉంది. ఈ ప్లాన్ రోజువారీ డేటా అయిపోయిన వినియోగదారుల కోసం ఉద్దేశించబడింది.