Jio Rs 667 and Rs 444 Data Recharge Plans for IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 మరో నాలుగు రోజుల్లో ఆరంభం కానుంది. ఐపీఎల్ 17వ సీజన్ చూసేందుకు క్రికెట్ ఫాన్స్ సిద్ధమవుతున్నారు. మరోవైపు ఐపీఎల్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రముఖ టెలికాం కంపెనీలు డేటా ప్యాక్‌లను రిలీజ్ చేస్తున్నాయి. క్రికెట్ అభిమానుల కోసం ‘రిలయన్స్ జియో’ రెండు డేటా ప్యాక్‌లను అందిస్తోంది. వాస్తవానికి రూ.667, రూ.444 ప్లాన్లు కొంతకాలంగా యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. ఐపీఎల్ 2024 చూడాలనుకునే వారికి ఈ ప్యాక్‌లు సరిగ్గా సరిపోతాయి. ఈ ప్యాక్‌ల డేటాయిల్స్ ఓసారి చూద్దాం.
Jio 667 Data Recharge Plan:
రిలయన్స్ జియో రూ.667 ప్లాన్ వ్యాలిడిటీ 90 రోజులు. ఇది డేటా వోచర్ మాత్రమే. ఇందులో వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్ వంటి ప్రయోజనాలు ఉండవు. యాక్టివ్ బేస్ ప్లాన్ ఉంటేనే దీనిని రీఛార్జ్ చేసుకోవాలి. ఈ ప్లాన్‌లో మొత్తం 150 జీబీ డేటా వస్తుంది. రోజువారీ లిమిట్ ఏమీ ఉండదు.
Jio 444 Data Recharge Plan:
జియో రూ.444 ప్లాన్ వ్యాలిడిటీ 60 రోజులు. ఇది కూడా డేటా వోచర్ మాత్రమే. వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్ వంటి ప్రయోజనాలు ఇందులో ఉండవు. యాక్టివ్ బేస్ ప్లాన్ ఉంటేనే ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌లో మొత్తం 100 జీబీ డేటా వస్తుంది. డైలీ లిమిట్ ఏమీ ఉండదు. కావాలంటే మొత్తం డేటా ఒకేసారి వాడుకోవచ్చు. వైఫై సదుపాయం లేకపోతే.. ఈ రెండు ప్లాన్‌లను జియో యూసర్లు పరిశీలించొచ్చు.
Also Read: Shreyanka Patil: ఆర్‌సీబీ విజయాల్లో కీలక పాత్ర.. ఎవరీ శ్రేయాంక పాటిల్!
How to watch IPL 2024 for free on Jio Cinema:
జియో సినిమా మొబైల్ యాప్‌లో ఐపీఎల్ 2024 ఫ్రీగా చూడొచ్చు. ఐపీఎల్ 2024 కోసం ఎలాంటి ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ అవసరం లేదు, ఇంటర్నెట్ ఉంటే చాలు. యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తే.. ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయగానే యాప్ ఓపెన్ అవుతుంది. ఇంకేముంది ఉచితంగానే ఐపీఎల్ మ్యాచులను వీక్షించొచ్చు.