RCB Player Shreyanka Patil Info and Stats: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్ ఛాంపియన్‌గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) నిలిచింది. స్మృతి మంధాన నాయకత్వంలోని ఆర్‌సీబీ.. ఆదివారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ విజయంతో ఆర్‌సీబీ కప్ కరువు తీర్చింది. గత 16 ఏళ్లగా పురుషుల జట్టుకు అందని ద్రాక్షలా ఊరిస్తున్న ట్రోఫీని ఎట్టకేలకు మహిళలు సాధించారు. ఆర్‌సీబీ ట్రోఫీని ముద్దాడడంలో ఆ జట్టు యువ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ కీలక పాత్ర పోషించింది.
21 ఏళ్ల శ్రేయాంక పాటిల్ డబ్ల్యూపీఎల్ 2024 ఫైనల్లో 4 వికెట్లు తీసింది. అంతకుముందు జరిగిన సెమీ ఫైనల్లో 2 వికెట్లు పడగొట్టింది. కాలి గాయంతో బాధపడుతూనే.. నాకౌట్ మ్యాచ్‌లలో అద్బుతమైన ప్రదర్శన చేసింది. ఈ సీజన్‌లో 8 మ్యాచ్‌లు ఆడిన శ్రేయాంక.. 13 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్‌ను కైవసం చేసుకుంది. అయితే టోర్నీ మొదటి నాలుగు మ్యాచ్‌ల్లో ఆమె విఫలమైంది. దాంతో రెండు మ్యాచ్‌లకు దూరమైంది. మళ్లీ జట్టులోకి వచ్చిన శ్రేయాంక.. రెచ్చిపోయింది.
Also Read: Kanguva Update: సూర్య ‘కంగువ’ అప్‌డేట్.. టీజర్ విడుదల ఎప్పుడంటే?
శ్రేయాంక పాటిల్ 2002లో బెంగళూరులో జన్మించింది. దేశీవాళీ క్రికెట్‌లో కర్ణాటక జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆమె.. అద్భుతంగా రాణించింది. దేశవాళీ ప్రదర్శనతో శ్రేయాంక భారత జట్టులోకి వచ్చింది. గతేడాది డిసెంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టింది. ఇప్పటివరకు భారత్ తరపున 2 వన్డేలు, 6 టీ20లు ఆడిన శ్రేయాంక.. 12 వికెట్లు పడగొట్టింది. ఇక డబ్ల్యూపీఎల్ 2023 వేలంలో శ్రేయాంకను రూ.10 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ డబ్ల్యూపీఎల్ 2023 వేలంలో శ్రేయాంకను రూ.10 లక్షల కనీస ధరకు ఆర్‌సీబీ కొనుగోలు చేసింది. 2024 సీజన్‌కు ముందు రిటైన్ చేసుకుంది.