NTV Telugu Site icon

Axar Patel: అక్షర్ హ్యాట్రికే కాదు.. చాలా మిస్సయ్యాడు

Axar

Axar

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అక్షర్ పటేల్ హ్యాట్రిక్ వికెట్లు తీసుకునే అవకాశం మిస్ అయింది. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ తొమ్మిదవ ఓవర్లో అక్షర్ పటేల్ బౌలింగ్ చేయగా.. ఆ ఓవర్‌లోని రెండవ, మూడవ బంతుల్లో తంజిద్ హసన్, ముష్ఫికర్ రహీమ్‌ను అవుట్ చేశాడు. అయితే.. అక్షర్ హ్యాట్రిక్ వికెట్లు తీసుకుంటాని అందరూ భావించినప్పటికీ.. కెప్టెన్ రోహిత్ శర్మ స్లిప్‌లో జాకీర్ అలీ క్యాచ్‌ను వదిలేశాడు. దీంతో అక్షర్ హ్యాట్రిక్ ప్రయత్నం విఫలమైంది. క్యాచ్ మిస్ చేసిన తర్వాత రోహిత్ కూడా చాలా నిరాశ చెందాడు. చేతులను గట్టిగా నేలకేసి బాదాడు.

Read Also: India On USAID: ‘‘భారత ఎన్నికల్లో అమెరికా జోక్యం’’.. ట్రంప్ వ్యాఖ్యలపై కేంద్రం స్పందన..

కాగా.. అక్షర్ పటేల్‌ హ్యాట్రిక్ సాధించినట్లయితే అతని పేరిట ఎన్నో రికార్డులు నమోదు అయ్యేవి. ఐసీసీ వన్డే టోర్నమెంట్‌లో అరంగేట్రంలోనే హ్యాట్రిక్ సాధించిన మొదటి స్పిన్నర్‌గా అక్షర్ నిలిచేవాడు. అంతేకాకుండా.. ఐసీసీ టోర్నమెంట్‌లో హ్యాట్రిక్ సాధించిన తొలి భారత స్పిన్నర్‌గా రికార్డులకెక్కే వాడు. ఇప్పటివరకు ఐసీసీ ఈవెంట్‌లలో ఏ భారత స్పిన్నర్‌ హ్యాట్రిక్ సాధించలేదు. భారతీయ వన్డే క్రికెట్‌లో మాత్రమే కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్ సాధించాడు. అయితే.. అక్షర్ పటేల్ హ్యాట్రిక్ చేస్తే కుల్దీప్ యాదవ్ తర్వాత రెండవ భారత స్పిన్నర్ గా నిలిచేవాడు. కుల్దీప్ 2017లో ఆస్ట్రేలియాపై, 2019లో వెస్టిండీస్‌పై హ్యాట్రిక్ సాధించాడు.

Read Also: Fakhar Zaman: ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఫఖర్ ఔట్.. ఏడుస్తున్న వీడియో వైరల్

ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటివరకు ఒకే ఒక్క హ్యాట్రిక్ నమోదైనది. 2006లో వెస్టిండీస్ పేసర్ జెరోమ్ టేలర్ ఈ ఘనత సాధించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో మైఖేల్ హస్సీ, బ్రెట్ లీ, బ్రాడ్ హాగ్‌లను వరుసగా అవుట్ చేసి జెరోమ్ టేలర్ హ్యాట్రిక్ సాధించాడు. అయితే.. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అక్షర్ పటేల్ హ్యాట్రిక్ వికెట్లు సాధిస్తే ఎన్నో రికార్డులు అతని పేరిట నమోదయ్యేవి.