T10 చరిత్రలో రికార్డు సాధించాడు స్పెయిన్ బ్యాట్స్మెన్ హమ్జా సలీం దార్.. కేవలం 43 బంతుల్లో 193 పరుగులు చేశాడు. 449 స్ట్రైక్ రేట్‌తో.. అంటే ప్రతి బంతికి 4 పరుగుల కంటే ఎక్కువ పరుగులు చేశాడు. స్పెయిన్‌లో జరుగుతున్న యూరోపియన్ క్రికెట్ సిరీస్‌లో హమ్జా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో.. టీ10 క్రికెట్ ఫార్మాట్‌లో అతిపెద్ద ఇన్నింగ్స్ ఆడిన రికార్డు సృష్టించాడు.