స్మార్ట్ ఫోన్లు పేలడం కోత్తేమి కాదు.. మనం తరుచుగా ఫోన్లు పేలిపోవడం గురించి వార్తల్లో చూస్తునే ఉంటాం. ఇటీవలే కేరళ రాష్ట్రంలోని త్రిసూర్ లో స్మార్ట్ ఫోన్లు పేలి ఎనిమిదేళ్ల బాలిక మరణించింది. ఈ బాలికే కాదు స్మార్ట్ ఫోన్లు పేలి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదంతా స్మార్ట్ ఫోన్ యూజర్లు అజాగ్రత్త వల్లే ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు. స్మార్ట్ ఫోన్లు పేలిపోవడానికి ప్రధాన కారణాలు బ్యాటరీకి సంబంధించినవే. స్మార్ట్ ఫోన్ బ్యాటరీలు కఠినమైన భద్రతా పరీక్షలలో ఉత్తీర్ణత సాధిస్తాయని చెప్పినప్పటికీ, ఫోన్లు పేలుతున్నట్లు అప్పుడప్పుడు నివేదికలు వస్తున్నాయి. అయితే ప్రతిసారీ స్మార్ట్ ఫోన్ పేలి మంటలు చెలరేగడానికి తయారీదారుల తప్పు కారణం మాత్రం కాదని మనం గుర్తించుకోవాలి. ఈ నేపథ్యంలో స్మార్ట్ ఫోన్ పేలడానికి మనం కూడా ఒక రకంగా కారణమని చెప్పాలి.
Also Read : Chandrababu Naidu: ఇసుక అక్రమ రవాణాపై చంద్రబాబు ఫైర్.. సీఎస్ కి లేఖ
అయితే స్మార్ట్ ఫోన్లు పేలిపోవడానిక మాత్రం అత్యంత ముఖ్యకారణం బ్యాటరీ లోపమే. మొబైల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లలో లియాన్ బ్యాటరీలతో రూపొందించబడతాయి. ఇవి కెమికల్ బ్యాలెన్స్ ను కలిగి ఉండాలి. వీడి దగ్గర వేడి పెరిగినప్పుడు లేదా వాటి కేసింగ్ దెబ్బ తిన్నట్లయితే స్మార్ట్ ఫోన్ పేలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్మార్ట్ ఫోన్లో ఉండే బ్యాటరీలు హీట్ అవుతున్నాయంటే చాలా ప్రమాదకరమని గుర్తించాలి. ముఖ్యంగా వేడి ఉండే ప్రదేశాల్లో ఫోన్ ను ఛార్జ్ చేయడం లేదా బ్యాటరీని రాత్రిపూట ఛార్జ్ చేయడానికి వదిలేయడం వల్ల ఫోన్ బ్యాటరీ వేడెక్కుతుంది. ఛార్జింగ్ సమయంలో బ్యాటరీని ఫోన్ కాల్స్ లేదా ఇతర అవసరాలకు ఉపయోగించినప్పటికీ.. బ్యాటరీ వేడెక్కే అవకాశం కూడా ఉంటుంది.
Also Read : Harish Rao: రైతులు అధైర్య పడొద్దు.. పరిహారం ఇస్తాం
ప్రతిస్మార్ట్ ఫోన్ బ్యాటరీకి నిర్దిష్ట ఛార్జింగ్ సైకిల్ ఉంటుంది. లియాన్ బ్యాటరీల విషయంలో, ఛార్జింగ్ అయిన తర్వాత కూడా అలాగే ఉంచితే బ్యాటరీ వేడెక్కీ త్వరగా ఉబ్బుతుంది. ఇలా ఉబ్బిన బ్యాటరీలు పేలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉబ్బిన బ్యాటరీలను మీరు గమనించినట్లయితే వెంటనే వాటిని మార్చండి. ఫోన్ చేతిలో కింద పడిపోయినప్పుడు బ్యాటరీ ఉబ్బినట్లు అనిపిస్తే దాన్ని మార్చేయండి. స్మార్ట్ ఫోన్లో కనిపించే డ్యామేజీ లేనప్పటికీ మీ ఫోన్లు తరచుగా కింద పడిపోతే.. మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే స్మార్ట్ ఫోన్లు సడెన్ గా కింద పడినప్పుడు బ్యాటరీ భాగాలు బాగా దెబ్బ తినే అవకాశం ఉంది.వాటితో పాటు ఇతర సెక్యూరిటీ భాగాలకు కూడా నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా కూడా స్మార్ట్ ఫోన్లు పేలిపోవచ్చు. మీరు వాడుతున్న ఫోన్ కు సంబంధించిన కంపెనీ ఛార్జర్లనే వాడాలి. అలా కాకుండా ఇతర ఛార్జర్లను పెట్టడం వల్ల కూడా మీ బ్యాటరీ పాడవ్వడం లేదా తీవ్రమైన ప్రమాదాలకు కారణం కావొచ్చు. ఫోన్ బ్యాటరీని డిజైన్ చేసిన దాని కంటే ఎక్కువ వోల్టేజీతో ఛార్జ్ చేయడం వల్ల కూడా బ్యాటరీ వేగంగా దెబ్బ తింటుంది. భారతదేశంలో స్మార్ట్ ఫోన్లు పేలడానికి ఇది ప్రధాన కారణంగా చెప్పవచ్చు.