స్మార్ట్ ఫోన్లు పేలడం కోత్తేమి కాదు.. మనం తరుచుగా ఫోన్లు పేలిపోవడం గురించి వార్తల్లో చూస్తునే ఉంటాం. ఇటీవలే కేరళ రాష్ట్రంలోని త్రిసూర్ లో స్మార్ట్ ఫోన్లు పేలి ఎనిమిదేళ్ల బాలిక మరణించింది. ఈ బాలికే కాదు స్మార్ట్ ఫోన్లు పేలి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదంతా స్మార్ట్ ఫోన్ యూజర్లు అజాగ్రత్త వల్లే ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు. స్మార్ట్ ఫోన్లు పేలిపోవడానికి ప్రధాన కారణాలు బ్యాటరీకి సంబంధించినవే.