Realme Narzo 70x Launch and Price: నార్జో సిరీస్‌లో ‘రియల్‌మీ’ మరో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను రిలీజ్ చేసింది. నార్జో 70 5జీ, నార్జో 70ఎక్స్ 5జీ ఫోన్‌లను రియల్‌మీ బుధవారం భారత్‌లో విడుదల చేసింది. ఈ రెండు ఫోన్స్ ఇప్పటికే కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. 50 ఎంపీ కెమెరా, 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందిస్తున్నారు. నార్జో 70 5జీ, నార్జో 70ఎక్స్ 5జీల స్పెసిఫికేషన్‌లు, ధర వివరాలను ఇప్పుడు చూద్దాం.
Realme Narzo 70 Price and Specs:
నార్జో 70 5జీ స్మార్ట్‌ఫోన్ 6GB ర్యామ్+128GB స్టోరేజ్ ధర రూ.15,999గా ఉంది. 8GB ర్యామ్+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999గ కంపనీ నిర్ణయించింది. ఐస్ బ్లూ, ఫారెస్ట్ గ్రీన్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మీ యూఐ 5.0 ఓఎస్‌ను ఇచ్చారు. మూడేళ్లు సెక్యూరిటీ అప్‌డేట్లు, రెండేళ్ల పాటు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు ఉంటాయి. 1,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 120Hz రీఫ్రెష్ రేటుతో 6.67 ఇంచెస్ డిస్‌ప్లేను ఇచ్చారు. మీడియాటెక్ డైమెన్సిటీ 7,050 ప్రాసెసర్ ఇందులో ఉంటుంది. 50ఎంపీ ప్రైమరీ సెన్సర్, f/1.8 అపెర్చర్, 2ఎంపీ సెన్సర్‌తో కూడిన బ్యాక్ కెమెరా సెటప్ ఉండగా.. సెల్ఫీల కోసం 16 ఎంపీ కెమెరా ఉంది. 45వాట్ సూపర్‌వూక్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. 61 నిమిషాల్లో పూర్తి ఛార్జ్ అవుతుంది.
Also Read: IPL 2024: సొంత ఆటగాడినే హేళన చేస్తారా.. ఇకనైనా ఆపండి! అక్రమ్ ఫైర్
Realme Narzo 70x Price and Specs:
నార్జో 70ఎక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్+128GB స్టోరేజ్ ధర రూ.11,999 కాగా.. 6GB ర్యామ్+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,499గా ఉంది. ఐస్ బ్లూ, ఫారెస్ట్ గ్రీన్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.ఇందులో 120 రీఫ్రెష్ రేటు 6.72 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఇచ్చారు. ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మీ యూఐ 5.0 ఓఎస్‌తో పనిచేస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్ ఉంటుంది. 50ఎంపీ ఏఐ కెమెరా, 2ఎంపీ మోనో కెమెరా, f/1.8 అపెర్చర్‌తో కూడిన బ్యాక్ కెమెరా సెటప్ ఉండగా.. సెల్ఫీల కోసం 8ఎంపీ కెమెరా ఉంది. 45వాట్ సూపర్‌వూక్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు.