రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Realme C100x Launched: రియల్మీ (realme) నుండి భారత మార్కెట్లో C-సిరీస్ స్మార్ట్‌ఫోన్ realme C100xను లాంచ్ చేసింది. బడ్జెట్ సెగ్మెంట్‌ను లక్ష్యంగా ఈ ఫోన్లో భారీ 8000mAh బ్యాటరీ, 45W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్, 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, 50MP కెమెరా వంటి మంచి ఫీచర్లు ఉన్నాయి. అలాగే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, IP64 డస్ట్ & స్ప్లాష్ రెసిస్టెన్స్‌తో మరింత బలమైన నిర్మాణాన్ని అందించింది.
120Hz డిస్ప్లే, Unisoc ప్రాసెసర్:
realme C100xలో 6.8 అంగుళాల HD+ IPS LCD డిస్ప్లేను అందించారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, గరిష్టంగా 900 నిట్స్ HBM బ్రైట్నెస్, Panda MN228 గ్లాస్ ప్రొటెక్షన్‌తో వస్తుంది. ఈ ఫోన్‌కు 12nm ఆధారిత Unisoc T7250 ఆక్టా-కోర్ ప్రాసెసర్ శక్తినిస్తుంది. ఇందులో 4GB LPDDR4X RAM, 12GB వరకు వర్చువల్ RAM సపోర్ట్ లభిస్తుంది. 64GB eMMC 5.1 స్టోరేజ్ తో పాటు microSD కార్డ్ ద్వారా 2TB వరకు స్టోరేజ్‌ను విస్తరించుకునే అవకాశం ఉంది.
Also Read
- New Smart Phone: 80W ఫాస్ట్ ఛార్జింగ్, 10,000mAh బ్యాటరీ.. మొబైల్ రంగంలో సంచలనం..
- Sodium Metal Battery Breakthrough: కేవలం 4 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్.. శాస్త్రవేత్తల సంచలన పరిశోధన..
- OnePlus: ఇండియాను వదిలి వెళ్లి పోతున్న వన్ ప్లస్..? క్లారిటీ..
- Airtel Perplexity Pro: ఎయిర్టెల్ యూజర్లకు అలర్ట్.. రేపటిలోగా ఈ పని చేయకపోతే ఖాతా నుంచి డబ్బు కట్!
50MP కెమెరా, ఆండ్రాయిడ్ 16:
ఫోటోగ్రఫీ కోసం వెనుక భాగంలో 50MP మెయిన్ కెమెరాతో పాటు LED ఫ్లాష్‌ను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత realme UI 7.0పై పనిచేస్తుంది.
8000mAh బ్యాటరీ:
ఈ ఫోన్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది 8000mAh భారీ బ్యాటరీ. దీనికి 45W సూపర్ VOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అలాగే రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే ఎక్కువ సమయం బ్యాటరీ బ్యాకప్ అందుతుందని కంపెనీ తెలిపింది.
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ:
realme C100xలో ఆర్మర్ షెల్ ప్రొటెక్షన్ తో పాటు MIL-STD-810H మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్ ఉంది. 2 మీటర్ల ఎత్తు నుంచి పడినా తట్టుకునేలా డ్రాప్ టెస్టులు పూర్తి చేసినట్లు కంపెనీ పేర్కొంది. అలాగే IP64 రేటింగ్ కారణంగా డస్ట్, స్ప్లాష్‌ల నుంచి రక్షణ లభిస్తుంది. ఇందులో పల్స్ లైట్ డిజైన్‌ను కూడా అందించారు. ఇది 9 రంగులు, 5 కస్టమైజ్ చేయగల గ్లోయింగ్ మోడ్‌లను సపోర్ట్ చేస్తుంది. కాల్స్, మెసేజ్‌లు, ఛార్జింగ్ సమయంలో ఈ లైట్లు ఆటోమేటిక్‌గా స్పందిస్తాయి.
ధర:
భారత్‌లో realme C100x 4GB + 64GB వేరియంట్ ధర రూ.14,499గా నిర్ణయించారు. ఇది డీప్ బ్లూ టైడ్స్, గోల్డెన్ కోస్ట్ వంటి రంగుల్లో అందుబాటులో ఉంటుంది. లాంచ్ ఆఫర్లో ఈ ఫోన్‌ను realme అధికారిక వెబ్సైట్, ఫ్లిప్‌కార్ట్, అలాగే ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు.
తాజావార్తలు
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌ను చంపిన వారికి 10 మిలియన్ డాలర్ల బహుమతి?.. ఇరాక్ సాయుధ గ్రూప్ సంచలన ప్రకటన
-
Minor Girl Harassment: 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై దాడి, ఆస్పత్రిలో మృతి
-
Jana Nayagan Release : జననాయగన్ దెబ్బకు బిచాణా ఎత్తేస్తోన్న సినిమాలు
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ రిటైర్మెంట్కు రంగం సిద్ధం..? చివరి వన్డే ఇదేనా..!
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!