RCB vs GT: నేడు గుజరాత్తో ఆర్సీబీ ఢీ.. గెలిచిన జట్టుకే ప్లేఆఫ్స్ ఛాన్స్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RCB vs GT: ఐపీఎల్ 2024లో నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో గుజరాత్ టైటాన్స్ పోటీ పడబోతుంది. బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఆర్సీబీ తమ చివరి రెండు మ్యాచ్ లలో అద్భుతంగా ఆడింది. ఈ క్రమంలో ఈ మ్యాచ్ కూడా గెలిచేందుకు ప్లాన్ చేస్తుంది. మరోవైపు గుజరాత్ టైటాన్స్ టీమ్ కూడా మళ్లీ విజయాలను నమోదు చేసేందుకు వ్యూహాలు రచిస్తుంది. జీటీ గత 10 మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు, ఆరు ఓటములతో పాయింట్ల పట్టికలో 8 స్థానంలో ఉండగా.. ఆర్సీబీ మాత్రం 10 మ్యాచ్‌ల్లో మూడు గెలిచి, 7 ఓడిపోయి చివరి స్థానంలో ఉంది.
Read Also: Bomb Threat : ఢిల్లీ బాంబు బెదిరింపు కేసు.. 20నిమిషాల్లో మెయిల్ క్రియేట్.. ఆ తర్వాత డిలీట్
Also Read
- AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్‌లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
- Kangana Ranaut-Baba Ramdev: నా యవ్వనం గురించి మీకెందుకు బెంగ.. బాబా రామ్‌దేవ్‌పై కంగనా ఫైర్
- School Holidays: కుక్కల బెడదతో స్కూళ్లకు సెలవులు.. 4 రోజులు ఆన్లైన్ క్లాసులే..
ఇక, బెంగళూరులో ఈరోజు వర్షం పడే ఛాన్స్ తక్కువగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, చిన్నస్వామి మైదానం బ్యాట్స్‌మెన్లకు అనుకూలంగా ఉంటుంది. చిన్న బౌండరీ కారణంగా ఈ గ్రౌండ్ లో ఫోర్లు, సిక్సర్లు ఈజీగా కొట్టొచ్చు. ఇక్కడ స్పిన్ బౌలర్లకు కూడా పిచ్ నుంచి మంచి సపోర్ట్ దొరుకుతుందని క్రీడా నిపుణులు అంటున్నారు. అయితే, చిన్నస్వామి స్టేడియంలో ఇప్పటి వరకు మొత్తం 88 ఐపీఎల్ మ్యాచ్‌లు జరగ్గా.. ఇందులో 37 మ్యాచ్‌ల్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్స్ గెలవగా.. సెకండ్ బ్యాటింగ్ చేసి జట్లు ఏకంగా 47 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. అంటే ఈ మైదానంలో ఛేజింగ్ కే ఎక్కువ లాభదాయకమని క్రీడా విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. ఇక ఇవాళ్టి మ్యాచులో గూగుల్ లో గెలుపు అంచనా ప్రకారం చూస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)కి 55 శాతం గెలిచే ఛాన్స్ ఉండగా.. గుజరాత్ టైటాన్స్ జట్టుకు 45 శాతం అవకాశం ఉంది.
Read Also: Rahul Gandhi: రాయ్‌బరేలీలో పోటీ చేయడంపై వయనాడ్ ప్రజలు ఏమంటున్నారంటే..!
ఇరు జట్ల అంచనా:
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ ( కెప్టెన్ ), విల్ జాక్స్, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్ ( వికెట్ కీపర్), మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, యశ్ దయాల్, మహ్మద్ సిరాజ్ ఉన్నారు.
గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా ( వికెట్ కీపర్), శుభమాన్ గిల్ ( కెప్టెన్ ), సాయి సుదర్శన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, షారుక్ ఖాన్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, నూర్ అహ్మద్, సందీప్ వారియర్ ఉన్నారు.
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్‌లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!