Anushka Sharma, Virat Kohli become parents to Baby Boy Akaay: సెలబ్రిటీ జంట విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు రెండోసారి తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 15న అనుష్క మగ బిడ్డకు జన్మనిచ్చిందని విరాట్ మంగళవారం ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో తెలిపాడు. అంతేకాదు విరుష్క దంపతులు తమ బిడ్డకు అకాయ్‌గా నామకరణం చేశారు. విషయం తెలిసిన క్రీడా, సినీ ప్రముఖులు, అభిమానులు కోహ్లీ-అనుష్క జోడీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో విరాట్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తమదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపింది.
అనుష్క శర్మ, విరాట్ కోహ్లీలకు కంగ్రాట్స్ చెప్పిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ.. భారతదేశం మొత్తం ఈరోజు హాయిగా నిద్రపోతుంది అని పేర్కొంది. ‘ఇప్పుడు నలుగురు సభ్యులు. విరాట్, అనుష్కలకు శుభాకాంక్షలు. ఆర్సీబీ కుటుంబంలోని అతి పిన్న వయస్కుడైన అకాయ్‌ను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఇది చాలా సంతోషకరమైన వార్త. భారతదేశం మొత్తం ఈరోజు హాయిగా నిద్రపోతుంది’ అని ఆర్సీబీ ఎక్స్‌లో పేర్కొంది. ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది.
Also Read: Bihar Road Accident: బిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి!
అనుష్క శర్మ, విరాట్ కోహ్లీలకు 2017 డిసెంబర్‌లో వివాహం కాగా.. 2021 జనవరిలో కూతురు వామిక పుట్టింది. ఇప్పుడు కుమారుడు అకాయ్ జన్మించాడు. వ్యక్తిగత కారణాలతో ప్రస్తుతం జరుగుతున్న భారత్, ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌కు విరాట్ దూరమైన సంగతి తెలిసిందే. సిరీస్‌కు దూరంగా ఉండటానికి గల కారణం వెల్లడికాకపోవడంతో.. కోహ్లీ తల్లికి అనారోగ్యం బాగాలేదని, అనుష్క ప్రెగ్నెన్సీలో ఇబ్బందులు ఉన్నాయంటూ పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. చివరకు తనకు కుమారుడు పుట్టాడని కోహ్లీ స్వయంగా చెప్పడంతో అన్ని వార్తలకు చెక్ పడింది. అసలు విషయం ఏంటో అందరికి తెలిసింది. ఈ నేపథ్యంలోనే భారతదేశం మొత్తం ఈరోజు హాయిగా నిద్రపోతుంది అని ఆర్సీబీ పేర్కొంది.
And then there are four 👨👩👧👦🤩
Many congratulations to Anushka and Virat, and a big welcome to the youngest member of the RCB family, Akaay 🤗❤️
This is such a happy news and India will sleep well tonight 😇#PlayBold #ನಮ್ಮRCB @AnushkaSharma @imVkohli pic.twitter.com/2hDYE4TGd6
— Royal Challengers Bangalore (@RCBTweets) February 20, 2024