గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ , దర్శకుడు బుచ్చిబాబు సనా కాంబినేషన్ లో ఆర్సి 16 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా రూపొందనున్న సంగతి అందరికీ తెలిసిందే.ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కూడా ముఖ్యమైన పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం.. అయితే ఇంతకు ముందు రామ్ చరణ్ నటించిన సినిమాలలో మెగాస్టార్ చిరంజీవి కనిపించిన కూడా అందులో కేవలం గెస్ట్ రోల్ గా మాత్రమే కనిపించడం జరిగింది.. కానీ బుచ్చిబాబు డైరెక్షన్‌లో వచ్చే సినిమాలో మాత్రం మెగాస్టార్ ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపించనున్నాడని సమాచారం.. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.ఈ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా ప్రారంభం కానుంది. మరి ఈ సినిమాలో చిరంజీవి ఎలాంటి రోల్ లోకనిపించబోతున్నాడు అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.రాంచరణ్, బుచ్చిబాబు సనా కాంబినేషన్ లో రాబోయే మూవీ స్పోర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్‌తో గ్రామీణ నేపథ్యంతో తెరకెక్క నుందని సమాచారం.
స్పోర్ట్స్‌లో హీరోకు మెలకువలు నేర్పే పాత్రకు ఎవరిని తీసుకుందామనే ఆలోచన చేస్తుండగా మెగాస్టార్ చిరంజీవి అయితే మంచి హైప్ ఉంటుందని చిత్రం యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం.. అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా ఆ పాత్రలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం.ఈ న్యూస్ వైరల్ అవ్వడం తో ఈ మూవీ పై అంచనాలు మరింత పెరిగాయి. ప్రస్తుతం రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజెర్ సినిమాలో నటిస్తూ ఎంతో బిజీ బిజీ గా వున్నాడు.ఈ సినిమాలో రాంచరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు అలాగే లీక్డ్ పిక్స్ ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేసాయి. ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది.దర్శకుడు శంకర్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో ఎంతో రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో తెరకేక్కిస్తున్నట్లు సమాచారం.