రుణమాఫీ ఆఫర్ల పేరుతో వచ్చే ప్రకటనలు నమ్మి ప్రజలు మోసపోవద్దని ఆర్‌బీఐ హెచ్చరించింది. రుణాలు తీసుకుంటే అవి మాఫీ అవుతాయని ప్రచారం చేస్తూ కొన్ని సంస్థలు వినియోగదారులను మభ్యపెడుతున్నాయని తెలిపింది. ఇలాంటి ప్రచారం ఆర్థిక సంస్థల స్థిరత్వాన్ని, డిపాజిటర్ల ప్రయోజనాలను దెబ్బతీస్తుందని స్పష్టం చేసింది.