CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో.. RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా మర్యాదపూర్వక భేటీ..

  • సీఎం రేవంత్ రెడ్డితో.. RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా మర్యాదపూర్వక భేటీ
  • రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్ధిక విధానాలను సంజయ్ మల్హోత్రా ప్రశంసించారు
  • రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలను RBI గవర్నర్ కు వివరించారు సీఎం రేవంత్
Revanth

Revanth

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా మర్యాదపూర్వక భేటీ అయ్యారు. RBI బోర్డ్ మీటింగ్ కు హాజరయ్యేందుకు హైదరాబాద్ వచ్చిన నేపథ్యంలో సీఎంను మర్యాదపూర్వకంగా RBI గవర్నర్ కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్ధిక విధానాలను సంజయ్ మల్హోత్రా ప్రశంసించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలను RBI గవర్నర్ కు వివరించారు సీఎం రేవంత్. విద్యుత్ రంగంలో సంస్కరణలు, మూడో డిస్కం ఏర్పాటుపై RBI గవర్నర్ కు వివరించారు.

సోలార్ విద్యుత్ వినియోగం పెంచే దిశగా చర్యలు చేపట్టినట్లు సీఎం ఆర్బీఐ గవర్నర్ కు వివరించారు. BUDS యాక్ట్ ను నోటిఫై చేయాలని ముఖ్యమంత్రిని RBI గవర్నర్ కోరారు. మరిన్ని సంస్కరణలు, ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు RBI గవర్నర్. యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ ఫేజ్ (ULI) విషయం RBI తీసుకుంటున్న చొరవను సీఎంకు వివరించారు RBI గవర్నర్. ప్రభుత్వ, ప్రైవేటు డిపాజిట్స్ క్లెయిమ్ క్యాంపెయినింగ్ పై సిఎం కు RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా వివరించారు.