తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా మర్యాదపూర్వక భేటీ అయ్యారు. RBI బోర్డ్ మీటింగ్ కు హాజరయ్యేందుకు హైదరాబాద్ వచ్చిన నేపథ్యంలో సీఎంను మర్యాదపూర్వకంగా RBI గవర్నర్ కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్ధిక విధానాలను సంజయ్ మల్హోత్రా ప్రశంసించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలను RBI గవర్నర్ కు వివరించారు సీఎం రేవంత్. విద్యుత్ రంగంలో సంస్కరణలు, మూడో డిస్కం ఏర్పాటుపై…