Irumudi: రవితేజ ‘ఇరుముడి’లో సీనియర్ హీరోయిన్ ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ మహారాజా రవితేజ, సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ఇరుముడి’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. క్రేజీ చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ నకాస్త్ర ఇందులో రవితేజ కుమార్తెగా నటిస్తోంది. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌తో పాటు శోభన పోషించబోయే ఎమోషనల్ పాత్ర ఈ సినిమాకు మేజర్ హైలైట్ కానున్నాయి. ఇక ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
Allso Read : Sameera Reddy:ఎయిర్‌పోర్ట్ లుక్ కోసం లక్షల ఖర్చు.. హీరోయిన్ల పరిస్థితిపై సమీరా రెడ్డి ఆవేదన!
Also Read
- Government Schools Decline: ఒకే ఏడాదిలో 9,900 ప్రభుత్వ పాఠశాలల మూత... తెలుగు రాష్ట్రాల్లో భారీగా..! కారణమేంటి?
- YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
- Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
- International Credit Cards: భారతీయులకు క్రెడిట్ కార్డులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న గ్లోబల్ బ్యాంక్స్.. ఎందుకంటే?
ఒకప్పటి స్టార్ హీరోయిన్, క్లాసికల్ డాన్సర్ శోభన ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ పాత్ర సినిమా మొత్తానికి ఒక ఎమోషనల్ పిల్లర్‌లా ఉంటుందని సమాచారం. ముఖ్యంగా రవితేజ,శోభన పాత్రల మధ్య ఉండే బాండింగ్, వారి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తాయని సమాచారం. ‘మజ్ను’, ‘నిన్ను కోరి’ వంటి ఎమోషనల్ హిట్స్ అందించిన శివ నిర్వాణ, ఈ చిత్రంలో కూడా ఫ్యామిలీ బాండింగ్స్‌ను అద్భుతంగా ఆవిష్కరిస్తున్నారట. ఈ సినిమాలో భాగం కావడంపై రవితేజ ఇప్పటికే స్పందిస్తూ..‘కొన్ని కథలు సరైన సమయంలో మనల్ని వెతుక్కుంటూ వస్తాయి, ఇరుముడి అలాంటి కథే’ అని చెప్పుకొచ్చారు. ఇక శోభన గురించి మూవీ టీం నుండి అధికారిక ప్రకటన రాబోతుంది.
తాజావార్తలు
-
Rahul Sipligunj : స్నేహితుడు ప్రేమ వ్యవహారంలో రాహుల్ సిప్లిగంజ్‌పై కేసు.. విశాఖలో FIR నమోదు
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
Jana Nayagan OTT Release: విజయ్ ‘జన నాయగన్’ ఓటీటీ ఎంట్రీ ఫిక్స్.. ఏ ప్లాట్ఫామ్లో అంటే?
-
Government Schools Decline: ఒకే ఏడాదిలో 9,900 ప్రభుత్వ పాఠశాలల మూత… తెలుగు రాష్ట్రాల్లో భారీగా..! కారణమేంటి?
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
ట్రెండింగ్
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!