Site icon NTV Telugu

Next Test Captain: టెస్ట్ కెప్టెన్ గా రవీంద్ర జడేజా?

Jadeja

Jadeja

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ ఫార్మేట్ నుంచి తప్పుకున్నాక సమస్యలు మొదలయ్యాయి. వాళ్లిద్దరూ ఉన్నప్పుడే మరో కెప్టెన్ ని తయారు చేయాల్సిన గంభీర్ ఆ దిశగా ఆలోచించలేదు. ఫలితంగా టీమిండియా టెస్ట్ జట్టు బలహీనంగా కనిపిస్తుంది. టెస్ట్ కెప్టెన్సీ రేసులో శుబ్ మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు కెప్టెన్ పాత్ర పోషిస్తే,,, రిషబ్ ని వైస్ కెప్టెన్ గా ఎంపిక చేయొచ్చు. కానీ టెస్టుల్లో పెద్దగా అనుభవం లేని గిల్ ని కెప్టెన్ చేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. జస్ప్రీత్ పేసర్ కావడంతో గాయాల సమస్యలు వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా టెస్ట్ కెప్టెన్ ఎంపికపై బీసీసీఐ పునరాలోచిస్తుంది. ఈ సమయంలో టెస్ట్ కెప్టెన్ విషయంలో మరోపేరు తెరపైకి వచ్చింది.

READ MORE: Rohit Sharma: వాంఖడేలో ‘రోహిత్ శర్మ’ స్టాండ్‌ ఆవిష్కరణ.. క్రికెట్ దిగ్గజాల సరసన హిట్ మ్యాన్

2012లో టెస్ట్ క్రికెట్లో డెబ్యూ చేసిన రవీంద్ర జడేజాను టెస్ట్ సారధిగా ఎంపిక చేయాలన్న డిమాండ్స్ వినిపిస్తున్నాయి. తన అనుభవం జట్టుకు పనికొస్తుందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. తాజాగా స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్ టీమిండియా టెస్ట్ క్రికెట్ భవిష్యత్తుపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. రవీంద్ర జడేజాను రెండేళ్లపాటు టెస్ట్ కెప్టెన్‌గా నియమించాలని అశ్విన్ బీసీసీఐని కోరాడు. జడేజాను రెండేళ్లపాటు కెప్టెన్‌గా చేసి, అతని నాయకత్వంలో యువ ఆటగాడికి వైస్ కెప్టెన్‌ బాధ్యతలు అప్పగించాలని చెప్పాడు. అశ్విన్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. దీంతో అందరి దృష్టి ఇప్పుడు జడేజా వైపు మళ్లింది. దీనిపై గంభీర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కాగా ఇంగ్లాండ్ టెస్ట్ పర్యటనతో 2025-27 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ సైకిల్ మొదలవుతుంది. ఈ సిరీస్ లో భాగంగా భారత్ ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్ట్ మ్యాచ్‌లు జరుగుతాయి. జూన్ 20న సిరీస్ ప్రారంభమవుతుంది. భారత జట్టు చివరిసారిగా 2007లో ఇంగ్లాండ్‌లో టెస్ట్ సిరీస్‌ను గెలుచుకుంది.

READ MORE: Jammu Kashmir: పాక్‌ని పట్టించుకునేదే లేదు.. రెండు ప్రాజెక్టుల పనుల వేగం పెంచండి..

Exit mobile version