మాస్ మహారాజ్ రవితేజ రీసెంట్ గా టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.రవితేజ టైగర్ నాగేశ్వరరావు వంటి పాన్ ఇండియా సినిమాతోనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.అక్టోబర్ 19 న దసరా కానుక గా భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఎక్కువ నిడివి తో మొదట్లో డివైడ్ టాక్ రావడంతో 20 నిమిషాల లెంగ్త్ ను మేకర్స్ తగ్గించారు. దీంతో సినిమాపై ప్రేక్షకుల అభిప్రాయం మారినప్పటికీ ఓ మోస్తారు కలెక్షన్లతో సరిపెట్టుకోవాల్సి అయితే వచ్చింది. పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైనప్పటికీ హిందీతో పాటు దక్షిణాది భాషల్లో కూడా అంతగా ప్రభావం చూపలేకపోయింది. అయితే ఈ సినిమా తర్వాత రవితేజ నటిస్తున్న మరో పాన్ ఇండియా చిత్రం ఈగల్.టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ అయిన కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.. ఇక ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది.అలాగే కావ్య థాపర్ మరో కీలక పాత్ర లో నటిస్తోంది.
సంక్రాతి కానుక గా ఈ సినిమాను జనవరి 13 న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ తాజాగా ఒక అప్‌డేట్ ను ఇచ్చారు. ఈ మూవీని హిందీలో ‘సహదేవ్’ అనే పేరుతో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. హిందీ వెర్షన్ కు సంబంధించిన టీజర్ ను ఈ రోజు రాత్రి విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.ఇక ఈగల్ మూవీ లో నవదీప్, శ్రీనివాస్ అవసరాల మరియు మధుబాల వంటి ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. డవ్‌జాండ్ సంగీతం అందిస్తున్నారు.
Mass Maharaj @RaviTeja_offl's #EAGLE 🦅 is making its way to Hindi audiences as #Sahadev 😎#SahadevTeaser 🔥 Drops today at 7:02 PM, Stay tuned to @peoplemediafcy 🤩
Worldwide Grand Release on JAN 13th in Telugu & Hindi! #EAGLEonJan13th 💥@Karthik_gatta @vishwaprasadtg… pic.twitter.com/elU5JEGZE7
— People Media Factory (@peoplemediafcy) December 15, 2023