Ganja Racket Busted: కూరగాయల వ్యాపారం మాటున గలీజు దందా.. భారీగా గంజాయి, నగదు స్వాధీనం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ganja Racket Busted: హైదరాబాద్‌లోని మలక్‌పేటలో గంజాయి దందా గుట్టురట్టయింది. కూరగాయల వ్యాపారం ముసుగులో గంజాయి విక్రయిస్తున్నట్లు గుర్తించిన ఎక్సైజ్ పోలీసులు నిందితుడి ఇంటిపై మెరుపు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భారీగా గంజాయి, నగదు కట్టలు బయటపడటంతో అధికారులు ఆశ్చర్యపోయారు. ‘అరుణ్ కారర్’ అనే వ్యక్తి రెండేళ్ల క్రితం పశ్చిమ బెంగాల్‌లోని హౌరా నుంచి హైదరాబాద్‌కు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఘన్సీ బజార్లో కూరగాయల వ్యాపారం నిర్వహిస్తున్న అతడు తెరవెనుక గంజాయి విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. తనకు తెలిసిన కస్టమర్లకు మాత్రమే గంజాయి సరఫరా చేస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు.
నిందితుడి ఇంట్లో తనిఖీలు నిర్వహించగా 450 గ్రాముల గంజాయితో పాటు రూ.7.59 లక్షల నగదు లభించింది. ముఖ్యంగా రూ.500 నోట్లతో రూ.10 వేల చొప్పున పేర్చిన 76 నగదు కట్టలను అధికారులు గుర్తించారు. ఒక్కో కట్టలో నోట్లను క్రమపద్ధతిలో పేర్చి ఉంచినట్లు గుర్తించారు. అయితే ఈ నగదు ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై నిందితుడు సరైన సమాధానం ఇవ్వలేదని సమాచారం. గంజాయి విక్రయాలకు ఉపయోగిస్తున్నట్లు భావిస్తున్న వేయింగ్ మెషిన్, ప్యాకింగ్ కవర్లను కూడా ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదు గంజాయి వ్యాపారం ద్వారా సంపాదించిందా..? లేక హవాలా లావాదేవీలకు సంబంధించినదా..? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
- MS Dhoni Drone Show: రెండు కళ్లు చాలవుగా చూడడానికి.. ధోనీ రెటైమెంట్తో ప్రత్యేక డ్రోన్ షో నిర్వహించిన సీఎస్కే..!
- Koti Deepotsavam 2026: వైభవంగా కోటి దీపోత్సవం.. ఐదో రోజు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇవే..
- 200MP కెమెరా, AMOLED సెకండరీ డిస్ప్లే, 6,000mAh బ్యాటరీతో Xiaomi 18 Pro లాంచ్..!
- 200MP+200MP కెమెరాలు, IP66+IP68+IP69 రేటింగ్స్, 7,050mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ Xiaomi 18 Pro Max లాంచ్..!
నిందితుడికి గంజాయి సరఫరా చేసే వ్యక్తులు ఎవరు..? అతడి వద్దకు వచ్చే కస్టమర్లు ఎవరు..? ఇంట్లో లభించిన నగదుకు సంబంధించిన మూలాలు ఏమిటి..? అనే అంశాలపై ఎక్సైజ్ పోలీసులు ఆరా తీస్తున్నారు. గంజాయి దందాతో పాటు హవాలా నెట్‌వర్క్‌కు ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలోనూ విచారణను ముమ్మరం చేశారు.
తాజావార్తలు
-
Ganja Racket Busted: కూరగాయల వ్యాపారం మాటున గలీజు దందా.. భారీగా గంజాయి, నగదు స్వాధీనం..!
-
SRH-IPL 2027: హెడ్‌కు గుడ్‌బై.. మరో 8 మంది అవుట్.. ఎస్ఆర్హెచ్ రిటెన్షన్, రిలీజ్, పర్స్ డీటెయిల్స్ ఇవే!
-
Trump Assassination Plot: ట్రంప్ హత్యకు కుట్ర.. పాకిస్థానీ వ్యక్తికి అమెరికాలో 27 ఏళ్ల జైలు శిక్ష!
-
MS Dhoni Drone Show: రెండు కళ్లు చాలవుగా చూడడానికి.. ధోనీ రెటైమెంట్తో ప్రత్యేక డ్రోన్ షో నిర్వహించిన సీఎస్కే..!
-
IPL 2027 Retentions: ధోనీ ఔట్.. ట్రావిస్ హెడ్, స్టార్క్‌కు షాక్.. 10 జట్ల రిటెన్షన్, రిలీజ్, పర్స్ డీటెయిల్స్ ఇవే!
ట్రెండింగ్
-
200MP కెమెరా, AMOLED సెకండరీ డిస్ప్లే, 6,000mAh బ్యాటరీతో Xiaomi 18 Pro లాంచ్..!
-
200MP+200MP కెమెరాలు, IP66+IP68+IP69 రేటింగ్స్, 7,050mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ Xiaomi 18 Pro Max లాంచ్..!
-
MS Dhoni IPL Retirement: నా ఆలోచన తప్పు అని ఫాన్స్ నిరూపించారు.. ఎంఎస్ ధోనీ ఎమోషనల్ పోస్ట్!
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!