Rashmika Mandanna: ఇటీవలే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన టాలీవుడ్ స్టార్ కపుల్ రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా తన ప్రేమ ప్రయాణం, పెళ్లి గురించి ఒక నెటిజన్ రాసిన కథనంపై రష్మిక స్పందిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. తన బ్లాగ్‌లో ఒక అభిమాని వీరిద్దరి కెరీర్, ప్రేమ, పెళ్లి గురించి ఎంతో హృద్యంగా వివరించారు. దీనిపై స్పందించిన రష్మిక ఇలా రాసుకొచ్చారు.. “చాలా రోజుల తర్వాత నా గురించి రాసిన ఒక ఆర్టికల్ చదివి కళ్లు చెమర్చాయి. చెప్పాలని చాలా ఉంది కానీ మాటలు రావడం లేదు. నాకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని వెతుక్కునే ఈ ప్రయాణంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా భావాలను ఇంత అందంగా గుర్తించి రాసినందుకు ధన్యవాదాలు. ప్రేమ గురించి నేనొకటే చెబుతాను.. మిమ్మల్ని స్వేచ్ఛగా ఉండనిచ్చే ప్రేమను వెతుక్కోండి.”
READ ALSO: Arshdeep Singh: డారిల్ మిచెల్‌కు క్షమాపణ చెప్పా.. నేను కావాలని కొట్టలేదు!
గత నెల ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్ వేదికగా ఈ జంట ఒక్కటయ్యారు. దాదాపు వారం రోజుల పాటు జరిగిన వివాహ వేడుకల అనంతరం, ఇప్పుడు తిరిగి వారివారి ప్రొఫెషనల్ లైఫ్‌లో బిజీ అయ్యేందుకు రెడీ అవుతున్నారు. పెళ్లి తర్వాత వీరిద్దరూ కలిసి నటించబోతున్న ‘రణబాలి’ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాలతో కలిసి మెప్పించిన ఈ జోడీ, రియల్ లైఫ్ కపుల్‌గా మారాక స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న ఫస్ట్ మూవీగా ‘రణబాలి’ నిలుస్తుంది.
READ ALSO: G7 Meeting: జీ7 దేశాలు అత్యవసర భేటీకి పిలుపు.. చమురుపై కీలక చర్చ!