బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్, అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘యానిమల్’. ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ 1 న విడుదల అయి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా రణ్ బీర్ ను ఎప్పుడు చూడనంత వైలెంట్ క్యారెక్టర్ లో చూపించి ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో రణ్ బీర్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం ఈ భామా యానిమల్ మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది. అయితే ఈ మూవీలో ఓ సీన్లో తన భర్త రణ్విజయ్ పాత్ర పోషించిన రణ్బీర్ కపూర్ ను ఆమె కొడుతుంది.ఆ సీన్ చేసిన తర్వాత తాను నిజంగా ఏడ్చేసినట్లు ఆమె చెప్పడం విశేషం. అంతగా తాను ఆ సీన్లో లీనమైపోయినట్లు పింక్విల్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక చెప్పింది.
యానిమల్ మూవీలో రణ్విజయ్ పాత్రలో రణ్బీర్ కపూర్ నటించగా గీతాంజలి పాత్రలో రష్మిక ఎంతగానో ఆకట్టుకుంది.ఈ మూవీలో జోయా పాత్ర పోషించిన తృప్తి డిమ్రితో తాను సెక్స్ చేసినట్లు ఓ సీన్లో తన భార్యకు రణ్బీర్ చెబుతాడు. అది విని అతన్ని చెంపదెబ్బ కొడుతుంది రష్మిక. ఈ సీన్ చేసిన తర్వాత తాను ఏడ్చానని, గట్టిగట్టిగా అరిచానని ఆమె వెల్లడించింది.అయితే అతన్ని కొట్టే సీన్ గురించి డైరెక్టర్ తనకు వివరించాడని, అలా జరిగినప్పుడు సహజంగా ఓ భార్య ఎలా ఫీలవుతుందో అలాగే ఫీలవ్వాలని మాత్రం అతడు చెప్పినట్లు ఆమె వివరించింది. “ఆ సీక్వెన్స్ మొత్తం ఒకే టేక్ లో చేసేశాం. ఎందుకంటే ఆ సీన్లో బాగా కదలిక ఉంది. ఏదీ అంచనా వేయలేని పరిస్థితి. నేనేం చేయబోతున్నానో కూడా నాకు తెలియని పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ఒకరు ఎలా ఫీలవుతారో అలాగే ఫీలవ్వాలని మాత్రమే సందీప్ నాకు చెప్పాడు. నాకు అది మాత్రమే గుర్తుంది. యాక్షన్ మరియు కట్ కు మధ్య నాకు ఇంకేమీ గుర్తు లేదు. అసలేం జరిగిందో తెలియదు. అని రష్మిక చెప్పింది