బిగ్ బాస్ ఫేమ్ దివి గురించి ఎంత చెప్పినా తక్కువే వరుస సినిమాలతో ఇప్పుడు ఫుల్ బిజీగా ఉంది.. ‘బిగ్ బాస్’కి ముందు మహేష్ బాబు ‘మహర్షి’, ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ సినిమాల్లో నటించింది.. బిగ్ బాస్ లో తన అందచందాలతో ఆకట్టుకుంది.. ఆ తర్వాత చిరంజీవి ‘గాడ్ ఫాదర్’, జగపతి బాబు ‘రుద్రంగి’తో పాటు కొన్ని సినిమాలు చేశారు. ‘మా నీళ్ల ట్యాంక్’, ‘ఏటీఎం’ వెబ్ సిరీస్లు సైతం చేశారు. ప్రస్తుతం హీరోయిన్ గా లంబసింగి.. సినిమాలో నటిస్తుంది.. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..
ఒక మంచి లవ్ స్టోరీగా ఈ సినిమా రాబోతుంది.. సోగ్గాడే చిన్ని నాయన’, ‘రారండోయ్ వేడుక చూద్దాం’, ‘బంగార్రాజు’ సినిమాల దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల ఈ సినిమాతో నిర్మాతగా మారుతున్నాడు.. నవీన్ గాంధీ దర్శకత్వం వహించారు. భరత్ హీరోగా పరిచయం అవుతున్నారు. అన్ని కార్యక్రమాలను త్వరగా పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది..
ఇక ఈ సినిమా కోసం రష్మికను రంగంలోకి దింపింది దివి..రష్మిక నటిస్తున్న ‘పుష్ప 2’లో ఓ కీలక పాత్రలో దివి నటిస్తున్నారు. షూటింగ్ కలిసినప్పుడు ‘లంబసింగి’ గురించి చెప్పగా… మార్చి 15న ‘లంబసింగి’ విడుదల అవుతోంది. చాలా కష్టపడి తీశారు. అందరూ ఎంతో హార్డ్ వర్క్ చేశారు. థియేటర్లకు వెళ్లి సినిమా చూడండి. ఈ మూవీకి సపోర్ట్ చేయండని చిత్ర బృందానికి రష్మిక బెస్ట్ విషెస్ చెప్పారు.. ఆ వీడియోనే ఇప్పుడు వైరల్ అవుతుంది..