బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. బుల్లితెర యాంకర్ ‘రష్మీ గౌతమ్’ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంటారు. తనకి సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ.. ఎప్పుడు ఏదొక వార్తతో వార్తల్లో నిలుస్తుంది.. అందులోనూ ఆమెకు జంతువులు అంటే మహా ఇష్టం… వాటికి ఏమైనా కష్టం కలిగితే అసలు ఊరుకోదు.. వెంటనే రెస్పాండ్ అవుతుంది…మూగ జీవాలు పై ఎంతో ప్రేమ కలిగిన రష్మీ.. వాటి విషయంలో నెటిజెన్స్ తో సోషల్ మీడియాలో ఫైట్ చేస్తుంటారు.. తాజాగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు.. ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది..
రష్మీ జంతు ప్రేమికురాలు. చాలా సందర్భాల్లో రష్మీ జంతువులపై తన ప్రేమ చాటుకుంది. లాక్ డౌన్ టైంలో ఫుడ్ లేక అల్లాడుతున్న జంతువులకు రష్మీ స్వయంగా ఆహారం అందించింది. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.. తాజాగా తన ఇంట బాధాకరమైన ఘటన వెలుగు చూసింది.. రష్మీ ప్రేమగా పెంచుకుంటున్న తన పెట్ మరణించింది. తన పెంపుడు కుక్కకి రష్మీ చుట్కి గౌతమ్ అని పేరు పెట్టింది. చుట్కి గౌతమ్ తన బేబీ గర్ల్ అని రష్మీ పోస్ట్ చేసింది..
ఆ చుట్కీ ఎందుకు చనిపోయిందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.. మరణించిన కుక్కపై రష్మీ పూలమాలలు వేసిన ఫోటో ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. రీసెంట్ గా చుట్కితో ఎంత ప్రేమగా తాను గడిపానో అనే విషయాన్ని తెలిపే ఫోటోలని షేర్ చేసింది.. ఆ ఫోటోలు వైరల్ అవ్వడంతో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు..