సినిమా ఇండస్ట్రీలో హీరోలకు ఇచ్చే ప్రాధాన్యత మనకు తెలిసిందే. మొదటి నుంచే హీరోలకే ఎలివేషన్, పవర్ ఫుల్ సీన్లు, బలమైన రోల్స్ ఇవన్నీ రెగ్యులర్‌గా కనిపిస్తాయి. కానీ చాలా సందర్భాల్లో హీరోయిన్లను మాత్రం సపోర్టింగ్ రోల్స్‌కే పరిమితం చేస్తారన్న విమర్శలు వచ్చి పోతూనే ఉన్నాయి. హీరోయిన్ కి కూడా చాలా అరుదు. ఇక తాజాగా ఈ విషయం గురించి టాలీవుడ్ హీరోయిన్ రాశీ ఖన్నా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారాయి.
Also Read : Keerthy Suresh : కొత్త ప్రయాణం మొదలు పెట్టబోతున్న కీర్తి సురేష్ ..
టాలీవుడ్‌లో ‘ఊహలు గుసగుసలాడే’తో ఎంట్రీ ఇచ్చిన రాశీ, జిల్, బెంగాల్ టైగర్, హైపర్, ఠోలిప్రేమ, శ్రీనివాస కళ్యాణం వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నా. పెద్ద బ్రేక్‌లు రాకపోవడంతో కొంతకాలం ఇండస్ట్రీకి దూరమైంది. తర్వాత బాలీవుడ్ వైపు వెళ్లి బోల్డ్ రోల్స్ చేస్తూ తన కొత్త కోణాన్ని చూపించింది. ఇటీవల సిద్దు జొన్నలగడ్డతో చేసిన ‘తెలుసు కదా’ హిట్ అవ్వడంతో మళ్లీ క్రేజ్ పెరిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ క్రమంలో రాశీ ఒక ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో ఉన్న లింగ అసమానత గురించి బోల్డ్‌గా మాట్లాడింది.
“మన దేశంలో హీరో వర్షిప్ చాలా కాలం నుంచే ఉంది. మేల్ యాక్టర్స్ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు తేస్తారని అందరూ నమ్ముతారు. అది నిజమే.. కానీ మార్కెట్ జెండర్ మీద ఆధారపడదు, టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది” అని రాశీ చెప్పింది. అదే సమయంలో మరో ప్రధాన విషయంలో కూడా ఆమె స్పష్టంగా స్పందించింది.. “స్క్రీన్ మీద హీరో, హీరోయిన్ ఎవరికైతే ఎక్కువ మార్కెట్ ఉందో వాళ్లే నిర్ణయిస్తారు. కానీ సెట్స్‌పై మాత్రం అందరికీ సమాన గౌరవం రావాలి. మహిళా నటీమణుల పట్ల కూడా మన ప్రవర్తనలో, సదుపాయాల్లో, గౌరవంలో ఎలాంటి తేడా ఉండకూడదు” ఇండస్ట్రీలో ఇంకా హీరోలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితి ఉందని, హీరోయిన్లు ఎంత టాలెంట్ ఉన్నా కొన్నిసార్లు రెండో స్థానానికి పడిపోతున్నారని రాశీ తెలిపారు. ఇక రాశీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటిజన్లలో పెద్ద చర్చగా మారాయి. చాలా మంది ఆమె మాటలకు మద్దతు తెలుపుతూ, “అవును మహిళా నటీమణులకూ సమాన గౌరవం తప్పకుండా రావాలి” అని కామెంట్లు చేస్తున్నారు.