AP HRC: “నాలుగు వారాల్లో నివేదిక సమర్పించండి”.. రాప్తాడు ఘటనను సుమోటోగా స్వీకరించిన హెచ్ఆర్సీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP HRC: అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలోని జడ్పీ హైస్కూల్లో చోటుచేసుకున్న తీవ్ర దిగ్భ్రాంతికరమైన ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసింది. అక్టోబర్ 31, 2026న గణితం పాఠం జరుగుతుండగా, హేమంత్ (21) అనే వ్యక్తి రన్నింగ్‌లో ఉన్న ఎలక్ట్రిక్ చైన్సాతో తరగతి గదిలోకి చొరబడి 10వ తరగతి విద్యార్థినిపై దారుణంగా దాడి చేశాడు. ఆమెను కాపాడేందుకు యత్నించిన లక్ష్మి అనే మరో విద్యార్థినికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరినీ రక్తపు మడుగులో వదిలి నిందితుడు పరారయ్యాడు. పాఠాలు చెబుతున్న సమయంలో గుర్తుతెలియని బయటి వ్యక్తిని అనుమతించడం సిబ్బంది భద్రతా వైఫల్యానికి నిదర్శనమని కమిషన్ మండిపడింది. పాఠశాలల్లోకి అనధికార వ్యక్తుల ప్రవేశాన్ని నిషేధిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఆక్షేపించింది. ఈ ఘోరంపై హెచ్ఆర్సీ ఛైర్మన్ జస్టిస్ ఎం. సత్యనారాయణ మూర్తి, సభ్యులు జె.వి. మనోహర్ రెడ్డి స్పందిస్తూ.. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, అనంతపురం కలెక్టర్, డీఈఓలకు నోటీసులు జారీ చేశారు. పాఠశాలల్లో విద్యార్థుల భద్రతా మార్గదర్శకాల అమలుపై 4 వారాల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను డిసెంబర్ 4, 2026కి వాయిదా వేశారు.
ఇదిలా ఉండగా.. రాప్తాడు ఉన్నత పాఠశాలలో విద్యార్థినులపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి చేసిన ఉన్మాది హేమంత్ కుడికాలును వైద్యులు ఇటీవల తొలగించిన విషయం తెలిసిందే. పోలీసుల కాల్పుల్లో గాయపడిన నిందితుడు అనంతపురం సర్వజన వైద్యశాలలో చికిత్స పొందాడు. కాల్పుల ఘటనలో అతడి కాళ్లలోకి ఆరు బుల్లెట్లు దూసుకెళ్లాయి. తీవ్ర రక్తస్రావమైంది. కుడి కాలికి రక్తప్రసరణ చేసే నాళాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. తొడ కింది భాగం నల్లగా మారి కుళ్లిపోయినట్లు వైద్యుల బృందం నిర్ధారించిందని సూపరింటెండెంట్ మల్లీశ్వరి రెండ్రోలు కిందట తెలిపారు. కాలును తొలగించకపోతే ఇన్ఫెక్షన్ శరీరమంతా పాకి ప్రాణాలకే ప్రమాదం వాటిల్లే పరిస్థితి ఉంటుందని, అందుకే వైద్యుల బృందం మంగళవారం తెల్లవారుజామున 2 గంటల నుంచి 3 వరకు శస్త్రచికిత్స చేసి, కుడి కాలును తొలగించారని ఆమె వివరించారు.
Also Read
- AP Onion Prices: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కిలో ఉల్లిపాయలు
- Supreme Court: ఢిల్లీలో దీపావళి గిఫ్ట్స్ కల్చర్‌పై సుప్రీంకోర్టు ఆందోళన.. కాలుష్యంపై ఆగ్రహం..
- CM Chandrababu: "తక్షణమే ఆదుకోండి".. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు లేఖ
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి బంపర్ ఆఫర్.. ఆ సీనియర్ జట్టు కెప్టెన్‌గా బుడ్డోడి నియామకం
తాజావార్తలు
-
AP HRC: “నాలుగు వారాల్లో నివేదిక సమర్పించండి”.. రాప్తాడు ఘటనను సుమోటోగా స్వీకరించిన హెచ్ఆర్సీ
-
Chandrayaan Trailer: చంద్రయాన్ మూవీ ట్రైలర్ చూశారా!
-
Illegal IVF Centres : ఐవీఎఫ్ కేంద్రాల అక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్
-
AP Onion Prices: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కిలో ఉల్లిపాయలు
-
Supreme Court: ఢిల్లీలో దీపావళి గిఫ్ట్స్ కల్చర్‌పై సుప్రీంకోర్టు ఆందోళన.. కాలుష్యంపై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!