అత్యంత బ్రాండ్ వాల్యూ కలిగిన సెలబ్రీటీగా బాలీవుడ్ స్టార్ నటుడు రణ్ వీర్ సింగ్ నిలిచారు. ఇప్పుడు ఎక్కువ బ్రాండ్ వాల్యూ ఉంది రణ్ వీర్ సింగ్ కే. 2021లో అగ్రస్థానంలో భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఉండగా.. ఈ ఏడాది కోహ్లీని దాటి ఫస్ట్ ప్లేస్ కి రణ్ వీర్ చేరుకున్నారు. 2022 ఏడాదికి గానూ.. సెలబ్రిటీ బ్రాండ్ వాల్యూయేషన్ స్టడీ పేరిట కన్సల్టింగ్ షర్మ క్రోల్ విడుదల చేసిన జాబితాలో మొత్తం 185.1 మిలియన్ డాలర్లతో రణ్ వీర్ ఉన్నారు. ఇది భారత కరెన్సీలో రూ. 1530కోట్లకుపైనే.. ఇక టాలీవుడ్ నుంచి ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.
Also Read : Afghanistan Earthquake: ఆఫ్ఘన్, పాక్‌లలో 11 మంది మృతి.. 100 మందికి పైగా గాయాలు..
ప్రపంచవ్యాప్తంగా ఈ స్టార్లకు ఉన్న బ్రాండ్ ఎండార్స్ మెంట్స్, ఉనికి ఆధారంగా.. బ్రాండ్ విలువ లెక్కగట్టి క్రోల్ ప్రతి ఏడాది ఇలాంటి లిస్ట్ విడుదల చేస్తుంటుంది. 2022 సంవత్సరానికి ఇలాగే 25 మందితో కూడిన లిస్ట్ విడుల చేసింది. 2022లో ఇక టాప్-25 సెలబ్రిటీల బ్రాండ్ వాల్యూ మొత్తం 2021తో పోలీస్తే 39.1 శాతం మేర పెరిగి.. 1.6 బిలియన్ డాలర్లకు చేరిందని క్రోల్ పేర్కొంది. 2020సంవత్సరంలో విరాట్ కోహ్లీ బ్రాండ్ విలువ 237.3 మిలియన్ డాలర్లు ఉండగా.. 2021లో అది 185.7 శాతం పెరిగి.. 1.6 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఇక ఇప్పుడు అది 176.9 మిలియన్ డాలర్లకు చేరడం గమనార్హం. దీంతో రెండో స్థానానికి పరిమితమయ్యాడు. టీమ్ ఇండియా కెప్టెన్ గా కోహ్లీ వైదొలిగినప్పటి నుంచి అతడి బ్రాండ్ విలువ పడిపోతుందటం మనం ఇక్కడ చూడొచ్చు.
Also Read : 2023 Ugadi Panchanga Sravanam Live: డా.శంకరమంచి రామకృష్ణ శాస్త్రిగారి ఉగాది పంచాంగ శ్రవణం
బాలీవుడ్ స్టార్ యాక్టర్ అక్షయ్ కుమార్ 153.6మిలియన్ డాలర్లతో మూడో స్థానంలో నిలవగా.. నటి ఆలియా భట్ 102.9 మిలియన్ డాలర్ల బ్రాండ్ వాల్యూతో నాలుగో స్థానంలో ఉంది. భారతీయ మహిళల జాబితాలో ఈమెదే అగ్రస్థానం. ఇక దీపిక పదుకొణె 82.9 మిలియన్ డాలర్లతో బ్రాండ్ వాల్యూలో ఐదో స్థానం దక్కించుకుంది. భారత మాజీ క్రికెటర్, కెప్టెన్ ధోనీ.. ఈ లిస్ట్ లో ఆరో స్థానంలో నిలిచారు. అమితాబ్ బచ్చన్, సచిన్ టెండూల్కర్, హృతిక్ రోషన్, షారుక్ ఖాన్ టాప్ -10లో ఉన్నారు. దక్షిణ భారత సెలబ్రిటీలు టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 31.4 మిలియన్ డాలర్ల(రూ. 260కోట్లు ) బ్రాండ్ వ్యాలుతో ఈ లిస్ట్ లో 20వ స్థానంలో నిలవగా.. రష్మిక మందన 25.3 మిలియన్ డాలర్లతో 25వ స్థానంలో చోటు దక్కించుకుంది. ఇక టాప్-25 లిస్ట్ లో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్, జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా, కామన్ వెల్త్ క్రీడల గోల్డ్ మోడలిస్ట్, భారత బ్యా్డ్మింటన్ స్టార్ పీవీ సింధు కూడా ఉన్నారు.