చెరువు కబ్జాలపై రంగారెడ్డి కలెక్టర్ సీరియస్ అయ్యారు. గండిపేట, నెక్నామ్ పూర్‌లోని ఇబ్రహీం చెరువులో బఫర్ జోన్‌లో నిర్మిస్తున్న విల్లాల కూల్చివేతకు ఆదేశాలు జారీ చేశారు. లేక్ వ్యూ విల్లాస్ పేరుతో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేస్తున్నారు.
కలెక్టర్ కనిపించడం లేదు. రంగారెడ్డిజిల్లా కలెక్టరేట్‌కు వచ్చిన వాళ్ల కామెంట్ ఇది. ఆయన 3 వారాలుగా కలెక్టరేట్‌కు రావడం లేదట. మంత్రులు వస్తే కనిపిస్తున్నారు కానీ.. వర్క్ మాత్రం ఇంకెక్కడి నుంచో చేస్తున్నారట. దీంతో ఆ అధికారికి ఏమైంది? ఎందుకు కలెక్టరేట్‌కు రావడం లేదన్న చర్చ జరుగుతోంది. కలెక్టరేట్‌కు కలెక్టర్ ఎందుకు రావడం లేదు? అమోయ్ కుమార్. రంగారెడ్డి జిల్లా కలెక్టర్. జిల్లాకు బాస్ కావడంతో పని ఒత్తిడి.. ఇతరత్రా రాజకీయ ప్రెజర్స్ కామన్. వీటిని తెలివిగా…