ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించి ముక్కులు చెల్లించుకున్నారు. నేడు రంగం కార్యక్రమం జరిగింది. మాతంగి స్వర్ణలత రంగం భవిష్యవాణి వినిపించారు. మాతాంగి భవిష్యవాణిలో.. నా ప్రజలందరూ నా బాలబాలికలు సంతోషంగా బోనాలతోటి బాజా భజంత్రీలతో నాకు శాకలు సమర్పించారు.. కానీ ప్రతి ఏడాది ఏదోక లోపమైతే జరుగుతోంది.. నా బిడ్డలందరిని కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్నాను.. రాశులకొద్దీ రప్పించుకుంటున్నా గాని నాకు మీరు ఏమి చెయ్యడం లేదు.. జరుగుతున్న పరిణామాలకు నా పాత్ర ఉంటుంది..
Also Read:Trump-Putin: మంచిగా మాట్లాడతాడు.. తర్వాత బాంబ్‌లు వేస్తాడు.. పుతిన్‌పై ట్రంప్ ఆగ్రహం
ఎవ్వరు ఏమి చేస్తే దానికి ఫలితం అనుభవించాలి.. నాకు పూజలు చేసి రక్తం చూపించండి.. మీరు నన్ను సరిగ్గా చూసుకోవడం లేదు.. అయినా నేను అందరిని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నాను.. నాకు ఎవరైతే ఇబ్బంది పెడతారో వారంతా రక్తం కక్కుకుంటారు.. నాకు తప్పనిసరిగా అన్ని విధివిధానాల ప్రకారం పూజలు జరిపించండి.. ఏటికొక్క సారి నాకు ఇలా పూజలు జరిపించాలి.. నన్ను కొలిచే వారు.. నా అక్కచెల్లెలు అందరూ నన్ను కొలుస్తారు.. వారందరికీ అండదండగా ఉంటాను.. మీరు జాగ్రత్తగా ఉండాలి.. అగ్నిప్రమాదాలు జరుగుతాయి.. వర్షాలు కురుస్తాయి.. ఐదు వారాలు పప్పుబెల్లం.. శాక, పసుపు కుంకుమ లతో కొంగు బంగారం చెయ్యండి.. నాకు మాత్రం రక్తం చూపించకపోతే ఊరుకోను.. గ్రామం మొత్తం సంచారం చేస్తాను.. ఎవ్వరు ఆపినా నేను ఆగను.. ప్రాణం తియ్యను గాని రక్తం అయితే చూస్తారు.. అని మాతాంగి తెలిపింది.