బాలీవుడ్ స్టార్ హీరో రణ్‍బీర్ కపూర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ యానిమల్.అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో రణ్ బీర్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‍గా నటించింది.రణ్‍బీర్ తండ్రి పాత్రలో అనిల్ కపూర్ నటించారు..ఈ సినిమా లో బాబీ డియోల్ విలన్ గా నటించారు. డిసెంబర్ 1వ తేదీన హిందీ, తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్‍ల్లో యానిమల్ దుమ్మురేపుతోంది. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్ విపరీతంగా ఉంది. నేడు (నవంబర్ 27) హైదరాబాద్‍లో యానిమల్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగనుండగా.. సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.డిసెంబర్ 1న ఈ చిత్రం రిలీజ్ కానుండడంతో.. ప్రమోషన్లలో మూవీ యూనిట్ జోరు పెంచింది. హీరో రణ్‍బీర్ కపూర్ వరుసగా ప్రెస్‍మీట్లు, ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. అయితే ఇటీవల యానిమల్ సినిమా రన్‍టైమ్‍పై కూడా చాలా చర్చ జరుగుతోంది. ఈ మూవీ లాంగ్ రన్‍టైమ్‍పై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మీమ్స్ కూడా వస్తున్నాయి.
అయితే, యానిమల్ మూవీ రన్‍టైమ్ గురించి రణ్‍బీర్ కపూర్ తాజాగా స్పందించారు.యానిమల్ సినిమా రన్‍టైమ్ 3 గంటల 21 నిమిషాల 23 సెకన్లుగా ఉంది. ఓ సినిమాకు 3 గంటలే చాలా ఎక్కువ కానీ ఈ చిత్రానికి సుమారు మూడున్నర గంటల రన్ టైమ్ ఉంది. దీంతో అంతసేపు ఓపికగా ప్రేక్షకులు ఈ సినిమాని చూస్తారా.. అంతసేపు ఆసక్తిగా కూర్చొబెట్టేలా ఎంగేజింగ్‍గా ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బెంగళూరులో జరిగిన ప్రెస్‍మీట్‍లో ఈ విషయంపైనే హీరో రణ్‍బీర్ కపూర్ స్పందించారు.యానిమల్ కథకు అంత రన్ టైమ్ కచ్చితంగా అవసరం అని రణ్‍బీర్ చెప్పారు. రన్‍టైమ్ విషయంలో ప్రేక్షకులు భయపడరని తాము అనుకుంటున్నామని ఆయన అన్నారు. “మేమేదో గర్వంగా భావించి అంత లాంగ్ రన్‍టైమ్‍తో ఈ చిత్రాన్ని తీసుకురావడం లేదు. వీలైనంత అత్యుత్తమంగా ప్రేక్షకులకు చేరేందుకు ఈ స్టోరీకి అంత సమయం అవసరం. అందుకే లాంగ్ రన్‍టైమ్‍తో ఈ మూవీని రిలీజ్ చేస్తున్నాం” అని రణ్‍బీర్ కపూర్ సమాధానం ఇచ్చారు