Ramya Krishna : నేటి తరం హీరోయిన్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రమ్య కృష్ణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రమ్య కృష్ణ.. ఈ సీనియర్ హీరోయిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లాంటి సీనియర్స్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు, అలాగే తమిళ్ ఇండస్ట్రీ లో కూడా స్టార్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు.ప్రస్తుతం రమ్యకృష్ణ పలు సినిమాల్లో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమా లో శివగామి పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించారు రమ్యకృష్ణ.ఒకప్పుడు రమ్యకృష్ణ స్టార్ హీరోయిన్ గా తన అద్భుతమైన నటనతో ఎంతగానో మెప్పించారు… అలాగే తన అందం తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. రమ్యకృష్ణ దాదాపు తెలుగులో స్టార్ హీరోలందరి సరసన నటించారు.రీసెంట్ గా ఆమె సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించారు. ఈ సినిమాలో సూపర్ స్టార్ భార్యగా కనిపించారు రమ్యకృష్ణ.
ఇదిలా ఉంటే తాజాగా రమ్యకృష్ణ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో అటు ఇండస్ట్రీలో తెగ వైరల్ గా మారాయి. నేటి తరం హీరోయిన్స్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు రమ్యకృష్ణ.ఒకప్పుడు హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాల్లో అవకాశాలు వచ్చేవి. కానీ ఇప్పుడు మాత్రం ఇలా కాదు. ఒక్క సినిమా సక్సెస్ అయితే వరుసగా నాలుగు, ఐదు సినిమాల్లో ఛాన్స్ లు వస్తున్నాయి అని అన్నారు రమ్యకృష్ణ. మేము ఏళ్ల తరబడి హీరోయిన్స్ గా కొనసాగాము.. ఇప్పుడొస్తున్న హీరోయిన్స్ 25 ఏళ్ల వరకు కెరీర్ కంటిన్యూ చేయలేకపోతున్నారని ఆమె అన్నారు.అప్పట్లో మేము అనుకోకుండా కొన్ని తప్పులు చేసిన వాటిని కరెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉండేది. కానీ ఇప్పుడు అలా అయితే లేదు. మేము ఎన్నో ఏళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బును ఇప్పటి హీరోయిన్స్ అతి తక్కువ సమయంలోనే సంపాదిస్తున్నారు. అయితే టైమ్ ఎప్పుడు ఎలా మారుతుందో ఎవ్వరూ కూడా ఊహించలేరు అని తెలిపారు. ప్రస్తుతం రమ్యకృష్ణ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Also Read
- Harish Rao: రైతుల చేతులకు బేడీలు.. ఇదెక్కడి అన్యాయం? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
- Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
- Ambati Rambabu: స్థానిక ఎన్నికల వేళ సర్టిఫికెట్ల వివాదం.. అంబటి సంచలన ఆరోపణలు..
- AI Dance Video: "ప్రాంప్ట్ ఇదిగో".. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
తాజావార్తలు
-
IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
-
Harish Rao: రైతుల చేతులకు బేడీలు.. ఇదెక్కడి అన్యాయం? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
-
Stock Market Today: స్టాక్ మార్కెట్లో మళ్లీ నష్టాలు.. 1000 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్, 22,500 దిగువకు నిఫ్టీ!
-
Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
-
Ambati Rambabu: స్థానిక ఎన్నికల వేళ సర్టిఫికెట్ల వివాదం.. అంబటి సంచలన ఆరోపణలు..
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!