Ramdev on Owaisi: యూపీ ఎన్నికలపై రామ్‌దేవ్ కామెంట్స్.. ఒవైసీ పోటీపై సంచనల వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramdev on Owaisi: ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగున్నా.. అప్పుడే రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ.. ఉత్తరప్రదేశ్‌లో పోటీ చేయడంపై యోగా గురు రామ్‌దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒవైసీ ఉత్తరప్రదేశ్‌కు మంచివారని, ఆయన పోటీ చేయడం వల్ల కొన్ని వర్గాల ఓట్లు చీలిపోయి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ప్రయోజనం కలగవచ్చని అభిప్రాయపడ్డారు.
సోమవారం సంభాల్ జిల్లాలోని బాబ్రాలాలో నిర్వహించిన ప్రాంతీయ ఆర్య మహా సమ్మేళనానికి రామ్‌దేవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ మళ్లీ అధికారంలోకి రాకుండా ప్రతిపక్షాలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఒవైసీ గతంలో ప్రకటించారు. అలాగే, యోగి ఆదిత్యనాథ్ మూడోసారి ముఖ్యమంత్రి కావడం తమ పార్టీకి ఇష్టం లేదని అక్టోబర్ 25న షామ్లీ జిల్లా కైరానాలో జరిగిన సభలో పేర్కొన్నారు.. అయితే, ఒవైసీ ఉత్తరప్రదేశ్‌కు మంచివారా? అని ప్రశ్నించగా, ఇతర ప్రాంతాల గురించి చెప్పలేమని, అయితే ఉత్తరప్రదేశ్‌లో ఆయన పోటీ చేయడం వల్ల కొన్ని వర్గాల ఓట్లు చీలి యోగి ఆదిత్యనాథ్‌కు లాభం కలగవచ్చని రామ్‌దేవ్ వ్యాఖ్యానించారు. యోగి వరుసగా మూడోసారి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారా? అని అడిగిన ప్రశ్నకు, దేశాన్ని మంచి వ్యక్తులు పాలించాలని తాను కోరుకుంటున్నట్లు సమాధానమిచ్చారు.
Also Read
- BJP vs Congress: మోదీ ఎక్కడికీ వెళ్లరు'.. విపక్షాల మెగా ర్యాలీకి బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్
- CM Vijay : రూ.30 బియ్యంపై సీఎం విజయ్‌కు షాక్
- Chandra Kumar Bose: "చరిత్రను వక్రీకరించడం నేరం".. ఫౌజీ టీజర్‌ను వెంటనే డిలీట్ చేయాలని నేతాజీ మనవడు డిమాండ్..
- Tummidihatti Barrage: తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంపై మహారాష్ట్ర సీఎం సానుకూల స్పందన..
ఖర్గే వ్యాఖ్యలపైనా స్పందన
ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలపైనా రామ్‌దేవ్ స్పందించారు. అధికార పార్టీకి చెందినవారైనా, ప్రతిపక్ష నేతలైనా సరే, చౌకబారు వ్యాఖ్యలు చేయకూడదని అన్నారు. రాజకీయ నాయకులు పరస్పరం గౌరవంగా మాట్లాడాలని అభిప్రాయపడ్డారు. మరోవైపు.. సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ, కపటత్వం, ఆర్భాటం, మూఢనమ్మకాలు, మతపరమైన వంచనల వల్ల మత ప్రతిష్ఠ దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు.. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, హనుమంతుడు, శివుడి వేషధారణలతో కొందరు వ్యక్తులు మత గ్రంథాలు, పుణ్యక్షేత్రాల పేర్లను దుర్వినియోగం చేస్తూ మతాన్ని అపఖ్యాతిపాలు చేస్తున్నారని మండిపడ్డారు..
ఒవైసీ ఏమన్నారంటే?
గత వారం రాంపూర్‌లో జరిగిన బహిరంగ సభలో అసదుద్దీన్ ఒవైసీ.. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో పాటు సమాజ్‌వాదీ పార్టీ, అఖిలేష్ యాదవ్‌లపై విమర్శలు చేశారు. రాష్ట్రంలో అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం ఏర్పడకపోయినా, ముస్లిం సమాజానికి చెందిన వ్యక్తి ఎమ్మెల్యే, ఎంపీగా ఎదుగుతారని వ్యాఖ్యానించారు. ఏఐఎంఐఎం ప్రతినిధులు చట్టసభల్లోకి ప్రవేశించి అన్యాయాలకు వ్యతిరేకంగా గళం విప్పుతారని పేర్కొన్నారు. అయితే, 2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, ఒవైసీ పోటీ, ఓట్ల చీలిక, బీజేపీకి కలిగే రాజకీయ ప్రయోజనాలపై రామ్‌దేవ్ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్ హాట్ టాపిక్‌గా మారాయి..
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ఇంట్లో రోజుకు మూడుసార్లు ప్రాక్టీస్ చేసేదాన్ని.. సెంచరీ వెనుక ఉన్న రహస్యం ఇదే..
-
Thopudurthi Prakash Reddy: తోపుదుర్తిపై నాన్ బెయిలబుల్ సెక్షన్లతో కేసు.. ఏ క్షణంలోనైనా అరెస్ట్..?
-
BJP vs Congress: మోదీ ఎక్కడికీ వెళ్లరు’.. విపక్షాల మెగా ర్యాలీకి బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్
-
Sai Pallavi: డైరెక్టర్ ఇన్పుట్స్ కాదు.. సీతమ్మ ఆశీర్వాదమే ముఖ్యం
-
Ramdev on Owaisi: యూపీ ఎన్నికలపై రామ్‌దేవ్ కామెంట్స్.. ఒవైసీ పోటీపై సంచనల వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..