Baba Ramdev: తాజాగా రామ్ దేవ్ బాబా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దుస్తుల్లేకున్నా మహిళలు బాగుంటారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డారు. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్ ముందే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మహారాష్ట్ర థానేలో పతంజలి యోగా పీఠం, ముంబయి మహిళల పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో యోగా శిబిరం నిర్వహించారు. యోగా శిబిరం ముగిశాక మహిళలకు చీరలు ధరించే సమయం దొరకలేదు. దీంతో వారి డ్రెస్సింగ్ సెన్స్ పై రాందేవ్ బాబా షాకింగ్ కామెంట్సు చేశారు. మహిళలు చీరలో బాగుంటారు.. సల్వార్ సూట్స్ వేసుకున్నా అందంగా ఉంటారు. తన లాగా ఏం వేసుకోకున్నా బాగుంటారు. తాము పదేళ్ల వరకు మేం బట్టలే వేసుకోలేదని బాబా రామ్ దేవ్ అన్నారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన పలువురు.. రామ్దేవ్బాబాపై మండిపడుతున్నాయి.
Read Also: Border Dispute: మేఘాలయలో మరో 49 గంటలపాటు ఇంటర్‌నెట్ బంద్
మహళల వస్త్రధారణ గురించి బాబా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మహిళలను కించపరిచేలా మాట్లాడారని మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి వ్యాఖ్యలు చేసి సమాజానికి ఏం మేసేజ్ ఇస్తున్నారని పలువురు ప్రశ్నించారు. రామ్ దేవ్ బాబా ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు గతంలోనూ ఆయన ఇలాంటి కామెంట్లే చేశారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో పలువురు డ్రగ్స్ తీసుకుంటారని వ్యాఖ్యానించారు. దీంతో బాలీవుడ్ ఉలిక్కిపడింది. యావత్ బాలీవుడ్ ఇండస్ట్రీ డ్రగ్స్ గుప్పిట్లో చిక్కుకుందని, సినిమా పరిశ్రమను డ్రగ్స్ చుట్టుముట్టిందని ఆరోపించారు. ఉత్తర ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో నిర్వహించిన ఆర్యవీర్, వీరాంగన సదస్సులో రాందేవ్ ఈ వ్యాఖ్యలు చేశారు.