Ramayana Song: “కాపీ కొట్టేశాడా..?”.. రామాయణం సాంగ్‌లో ఏఆర్ రెహమాన్ ట్యూన్‌పై నెటిజన్ల ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramayana Song Controversy: నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణం’ నుంచి ఇటీవల విడుదలైన ‘మంగళ రంగ్’ పాట సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చ, విమర్శలకు దారితీసింది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా, అరిజిత్ సింగ్, శ్రేయా ఘోషల్ ఆలపించిన ఈ పాట శ్రీరామచంద్రుడు, సీతాదేవిల పవిత్ర ప్రేమను, వారి ప్రయాణాన్ని కీర్తిస్తూ సాగుతుంది. అయితే, ఈ పాటకు ఉపయోగించిన సూఫీ ఖవ్వాలీ తరహా సంగీత శైలిపై నెటిజన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సూఫీ ఖవ్వాలీ అనేది భక్తి, ఆధ్యాత్మిక భావాలతో కూడిన ఓ సంగీత ప్రక్రియ. ఈ పాటలో ఉపయోగించిన ట్యూన్లపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. రామాయణం లాంటి పవిత్ర ఇతిహాసానికి ఇలాంటి ట్యూన్లు ఏమాత్రం సరిపడవంటూ ఎక్స్ వేదికగా మండిపడుతున్నారు. మరికొందరు ఈ పాత మూవీలోని ట్యూన్స్ కాఫీ కొట్టాడంటూ ఫైర్ అవుతున్నారు.
Putting Sufi qawwali beats into Valmiki’s Ramayana is peak Bollywood delusion. 💀
Zero cultural grounding, zero research, just recycled templates slapped onto a massive budget. Stop treating sacred Itihasa like a regular Friday rom-com! https://t.co/PRfi75xgyJAlso Read
- Cyclone Arnab Alert: దూసుకొస్తున్న అర్నబ్ తుపాను.. నేడు పలు జిల్లాల్లో వర్షాలు, ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు!
- Potato Samosa: కరకరలాడే రుచికరమైన బేకరీ స్టైల్ 'ఆలూ సమోసా'.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
- Anushka-Virat: గ్లామర్, క్రికెట్ ప్రపంచానికి దూరంగా.. ఆధ్యాత్మిక బాటలో విరాట్ కోహ్లీ-అనుష్క దంపతులు
- Harmanpreet Kaur: కెప్టెన్సీ లేకపోతేమి.. బ్యాటింగ్‌ను ఎంజాయ్ చేయడమే నా లక్ష్యం..! హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన వ్యాఖ్యలు.!
— Gaurav (@k_gauravs) October 25, 2026
ఈ పాటపై వస్తున్న విమర్శల్లో ప్రధానంగా సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఎంపికపైనే ఎక్కువ ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. వాల్మీకి రామాయణంలోకి సూఫీ ఖవ్వాలీ బీట్స్ తీసుకొనిరావడం బాలీవుడ్ మతిమరుపునకు నిదర్శనమని, భారీ బడ్జెట్ ఉందంటూ పాత టెంప్లేట్లను ఇక్కడ కూడా కాపీ కొట్టారని ఓ నెటిజన్ తీవ్రంగా విమర్శించారు. రామాయణంలో ఖవ్వాలీ ఏంటని, రెహమాన్ మైండ్ పోయిందా అంటూ మరో నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా ‘రాక్‌స్టార్’, ‘జోధా అక్బర్’ సినిమాల్లోని ‘కున్ ఫయా కున్’ పాటను తలపిస్తోందని, రెహమాన్ తన పాత హోమ్వర్కునే మళ్లీ మళ్లీ రీసైకిల్ చేస్తున్నారని మరికొందరు విమర్శలు గుప్పించారు. కాగా.. “కున్ ఫయా కున్” (Kun Faya Kun) అనేది అరబిక్ పదం. ఇస్లామిక్ పవిత్ర గ్రంథం ఖురాన్‌లోని పలు సందర్భాలలో ఈ పదం కనిపిస్తుంది. ఇక, రామాయణ చిత్రానికి అజయ్-అతుల్ లేదా శంకర్-ఎహసాన్-లాయ్ (Shankar-Ehsaan-Loy) అయితే సరైన న్యాయం చేసేవారని అభిప్రాయపడ్డారు.
Qawwali in Ramayana. AR Rahman never fails to disappoint. https://t.co/OgOM28P3H3
— Alpakanya (@Alpakanya) October 25, 2026
ఈ చిత్రంలో కేవలం ఈ పాట మాత్రమే కాకుండా, రెహమాన్ అందించిన మ్యూజిక్ మొత్తం నిరాశపరిచిందని కొందరు కామెంట్స్ చేశారు. సంస్కృత సాంప్రదాయాలకు దగ్గరగా ఉండే పాటలను ఉపయోగిస్తే వంద రెట్లు బాగుండేదని, రామాయణం బీజీఎం మినహా మిగతా పాటలన్నీ యావరేజ్‌గానే ఉన్నాయని అభిప్రాయపడ్డారు. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్, సన్నీ డియోల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమాలో పాటల విషయంలో వచ్చిన ఈ నెగెటివిటీ సినిమాపై ఏ మేరకు ప్రభావం చూపుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Qawwali music in Ramayana AR Rahman are u nuts
#Ramayana https://t.co/xvyQnGIqlx
— Beë ♔ (@chaoticc_beee) October 25, 2026
Thanks @arrahman for giving us recycled Qawali tamil song for Ramayan Movie.
Imagine claiming to spend ₹9,000 Cr and hiring Big Beef Guy as Ram, Hindu-Army Hater as Sita and Allah Rakha Rahman for Music for an Hindu Epic! https://t.co/IxYGWGuPKw
— Arun Pudur (@arunpudur) October 25, 2026
Never liked any song in ramayana , only the ramayan bgm is good. Rest all songs are mid.. this song is particular is so low in vibe , they could have used shudh sanakrit songs would have been 100x better
— Dovahkiin (@akkicr77) October 25, 2026
Disappointing!! AR Rahman was the worst choice as music director for this movie. This sounds more like a qawwali. Heavily inspired by his prior work in Rockstar/Jodha Akbar. Very "Kun faya kun" vibes. Rahman did the same mediocre job with Chhaava as well. Ajay-Atul or Shankar-Ehsaan-Loy would have done justice to the music that this movie deserves. #Ramayana #MangalRang
— Dr. Shubham Misra शुभम मिश्रा🧠⚛️🇮🇳🇺🇸 (@Shubham_Neuro) October 25, 2026
తాజావార్తలు
-
Ramayana Song: “కాపీ కొట్టేశాడా..?”.. రామాయణం సాంగ్‌లో ఏఆర్ రెహమాన్ ట్యూన్‌పై నెటిజన్ల ఫైర్..
-
China: సినిమా హీరోలా? సైన్స్ వీరులా? ప్రపంచానికి కళ్లు తెరిపించిన చైనా
-
Cyclone Arnab Alert: దూసుకొస్తున్న అర్నబ్ తుపాను.. నేడు పలు జిల్లాల్లో వర్షాలు, ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు!
-
US, Russia and Ukraine Talks: రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు? నవంబర్‌లో కీలక త్రైపాక్షిక చర్చలు!
-
Potato Samosa: కరకరలాడే రుచికరమైన బేకరీ స్టైల్ ‘ఆలూ సమోసా’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
ట్రెండింగ్
-
Harmanpreet Kaur: కెప్టెన్సీ లేకపోతేమి.. బ్యాటింగ్‌ను ఎంజాయ్ చేయడమే నా లక్ష్యం..! హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన వ్యాఖ్యలు.!
-
PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
-
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!
-
Fake Note Printing : వామ్మో.. అద్దెకు డబ్బులు లేక.. కరెన్సీ నోట్లే అచ్చేశాడు..
-
Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ “దద్దోజనం” కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!