Cyclone Arnab Alert: దూసుకొస్తున్న అర్నబ్ తుపాను.. నేడు పలు జిల్లాల్లో వర్షాలు, ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyclone Arnab Latest Updates: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా బలపడుతూ తుపానుగా మారుతోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ వాయుగుండం దక్షిణ దిశగా కదులుతూ.. ఆదివారం తీవ్ర వాయుగుండంగా బలపడింది. అనంతరం పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణిస్తూ ఈరోజు ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడనున్నట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. మంగళవారం ఉదయానికి తీవ్ర తుపానుగా రూపాంతరం చెందే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఆ తర్వాత మరింత బలపడి అతి తీవ్ర తుపానుగా (అర్నబ్) మారి బుధవారం ఉదయానికి ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి చేరుకునే అవకాశం ఉందని తెలిపింది.
బాపట్ల-విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం:
అర్నబ్ తుపాను బుధవారం ఉదయానికి అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉండటంతో ఏపీ తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. ఈ తుపాను బుధవారం బాపట్ల-విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. దీంతో తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులు, చెట్లు విరిగిపడటం, విద్యుత్ సరఫరాకు అంతరాయం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Also Read
- OTR: చంద్రబాబుకు జనసేన ఫిర్యాదు.. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కు అగ్నిపరీక్ష!
- CS Karnan Dies: సీజేఐ సహా సుప్రీంకోర్టు జడ్జీల అరెస్టుకే ఆదేశాలు.. వివాదాస్పద మాజీ హైకోర్టు న్యాయమూర్తి కర్ణన్ కన్నుమూత!
- Achanta: సర్పంచ్ స్థానాన్ని ఏకగ్రీవం చేస్తే రూ. 2 కోట్లు ఇస్తా.. జనసేన నేత సంచలన ప్రతిపాదన..
- AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.32.49 లక్షల కోట్ల మైలురాయి..
గోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్:
అర్నబ్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు అధికారులు భారీ వర్ష సూచన జారీ చేశారు. ఈరోజు కోస్తాంధ్ర, రాయలసీమల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. గోదావరి జిల్లాలకు రేపు రెడ్ అలర్ట్ ప్రకటించారు. అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ జారీ అయింది. ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. తుపాను ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు:
తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు పొంచి ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వాగులు, వంకలు, నదులు ఉప్పొంగే ప్రమాదం ఉందని.. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపారు. తుపాను సమయంలో సముద్రంలోకి చేపల వేటకు వెళ్లకూడదని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశారు.
తుపానుపై ఏపీ ప్రభుత్వం హైఅలర్ట్:
అర్నబ్ తుపాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉండాలని సూచించింది. అత్యవసర పరిస్థితులు తలెత్తితే వెంటనే సహాయక చర్యలు చేపట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. ప్రజలకు ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారం అందించాలని, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను పర్యవేక్షించాలని అధికారులకు సూచించింది.
తాజావార్తలు
-
OTR: నేతల తన్నులాటలతోనే నందికొట్కూరులో టీడీపీ ఘోర ఓటమి?
-
Nagula Chavithi: నాగుల చవితి వేళ అద్భుతం.. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యక్షమైన నాగసర్పం!
-
CM Revanth Reddy : పిల్లల భవిష్యత్తే లక్ష్యం.. సీఎం రేవంత్ కీలక సందేశం
-
OTR: లెక్కలు మారుతున్నాయా? కంగారులో కూటమి.. వైసీపీ మాత్రం పక్కా లెక్కలతో ముందడుగు వేస్తుందా?
-
OTR: చంద్రబాబుకు జనసేన ఫిర్యాదు.. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కు అగ్నిపరీక్ష!
ట్రెండింగ్
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!