తెలుగు హీరోలు ఏదైనా ప్రత్యేకమైన రోజు వస్తే చాలా స్పెషల్ గా జరుపుకుంటారు.. ముఖ్యంగా పండగలను ఎలా సెలెబ్రేట్ చేసుకుంటారో మనం నిత్యం చూస్తూనే ఉంటాం.. అందులో మెగా ఫ్యామిలీ ముందు ఉంటుంది.. ఈసారి సంక్రాంతి వేడుకలను మెగా ఫ్యామిలీ బెంగుళూరు లో జరుపుకోనున్నారు.. ఫ్యామిలీ మొత్తం బెంగళూరుకు పయనం అయ్యారు.. తాజాగా ఈ వేడుకల్లో పాల్గొనేందుకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన, కూతురు క్లీంకారాతో బెంగళూరుకి బయలుదేరారు.. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
సాదారణంగా మెగా ఫ్యామిలీ ప్రతి ఏటా ఒకచోట చేరి సంక్రాంతి వేడుకలను జరుపుకుంటుంది. మెగా హీరోలంతా ఈ వేడుకల్లో పాల్గొంటారు. గతంలో బెంగళూరులోని ఫామ్ హౌస్‌లో సంక్రాంతి పండుగ జరుపుకున్న వీరంతా ఈ ఏడాది బెంగళూరులో పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు రామ్ చరణ్ బెంగళూరు బయలుదేరారు.. ఉపాసన, క్లింకార తో కలిసి బెంగళూరుకు బయలు దేరారు… ఎయిర్ పోర్ట్ లో వెళ్తున్నప్పుడు తీసిన వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..
ఇక సినిమాల విషయానికొస్తే.. రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నారు.. కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతోంది. శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో చరణ్ డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్. పొలిటికల్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు… ఈ ఏడాదిలోనే సినిమా విడుదల కాబోతుంది..