Peddi Nizam Rights: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘పెద్ది’ (Peddi). ఈ స్పోర్ట్స్ డ్రామాపై ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా బిజినెస్‌కు సంబంధించి ఒక ఆసక్తికర వార్త ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నైజాం (తెలంగాణ) ప్రాంతంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ సొంతంగా విడుదల చేయడానికి రెడీ అవుతుందని ప్రస్తుతం సినీ సర్కిల్‌లో జోరుగా ప్రచారం సాగుతుంది. సాధారణంగా భారీ చిత్రాలకు ఇతర డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఫ్యాన్సీ ఆఫర్లు వస్తాయి. కానీ, సినిమా అవుట్‌పుట్‌పై ఉన్న నమ్మకంతో మైత్రీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
READ ALSO: Rohit Sharma : ధోనీ రికార్డ్ బ్రేక్.. ఐపీఎల్‌లో ‘హిట్‌మ్యాన్’ సరికొత్త చరిత్ర!
నైజాం ఏరియా థియేటర్ హక్కుల విలువ సుమారు రూ.63 కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం నుంచి టికెట్ ధరల పెంపునకు అనుమతి రాకపోతే, ఇంత భారీ మొత్తాన్ని రికవరీ చేయడం సినిమాకు పెద్ద సవాలుగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే చరణ్ క్రేజ్ దృష్ట్యా ఇది సాధ్యమేనని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన ‘ఫస్ట్ గ్లింప్స్’, పాటలు సోషల్ మీడియాలో రికార్డులు సృష్టిస్తూ సినిమాపై హైప్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లాయి. మెగా పవర్ స్టార్ తన కెరీర్‌లో ఫస్ట్ టైం ఒక స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ స్టోరీలో నటిస్తుండటం, ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ రెహమాన్ సంగీతం అదిస్తుండటం వంటివి ఈ చిత్రంపై మరిన్ని అంచనాలను పెంచాయి. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన హీరోయిన్‌గా జాన్వీ కపూర్ నటిస్తుండగా, శివరాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ మొదలైన వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
READ ALSO: Astrology Predictions : రేపే శుక్రుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశుల వారికి గడ్డుకాలం.. జర జాగ్రత్త!